తెలుసు కదా... టిల్లు మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా..!
సిద్దు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ ఇటీవల వచ్చిన జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది.
By: Tupaki Desk | 3 Jun 2025 5:33 AMసిద్దు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ ఇటీవల వచ్చిన జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. సిద్దు జొన్నలగడ్డ నుంచి అభిమానులు ఆశిస్తున్న మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆ సినిమాలో లేదు కనుకే ఫెయిల్ అయింది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టిల్లు తరహా పాత్ర కోసం సిద్దు అభిమానులు వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సిద్దు నుంచి రాబోతున్న 'తెలుసు కదా' సినిమా ఆ తరహా జోనర్ ఎంటర్ టైన్మెంట్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన టీజర్, పోస్టర్, ప్రమోషన్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్దు నుంచి రాబోతున్న 'తెలుసు కదా' పై అంచనాలు భారీగా ఉన్నాయి.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రూపొందుతున్న 'తెలుసు కదా' సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహిస్తోంది. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నీరజ కోన ప్రస్తుతం తెలుసు కదా సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. తెలుసు కదా సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలు హీరోయిన్స్‌గా నటించారు. ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్రలో సిద్దు కనిపించబోతున్నాడు. ఇటీవల వచ్చిన సినిమా రిలీజ్ వీడియో లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి మధ్య సాగిన ఆసక్తికర సన్నివేశాల కారణంగా సినిమా ఏంటి... సినిమా కథాంశం ఏంటి అనేది క్లారిటీ వచ్చింది.
'తెలుసు కదా' సినిమాలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఇలాంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి మంచి డిమాండ్ ఉంది. అందుకే నీరజ కోన ఈ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ లుక్‌తో పాటు ఇతర అన్ని విషయాలు కూడా 'తెలుసు కదా' సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హిట్ 3 సినిమాలో నానికి జోడీగా నటించి హిట్‌ను సొంతం చేసుకుంది. కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు హిట్ 3 తో ఆకట్టుకుంది. త్వరలోనే తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.
సిద్దు జొన్నలగడ్డ గత చిత్రం జాక్ తీవ్రంగా నిరాశ పరచిన నేపథ్యంలో అన్ని విషయాల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా షూటింగ్ పూర్తి అయింది కనుక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఎడిటింగ్ విషయాల పట్ల సిద్దు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అక్టోబర్ 17న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కథల జోరులో ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనే అనుమానం లేదని, కచ్చితంగా పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. టిల్లు మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ సినిమాలో కావాల్సినంత అందించే అవకాశాలు ఉన్నాయి, తద్వారా సిద్దు కు మరో విజయం పక్కా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.