Begin typing your search above and press return to search.

'తెలుసు కదా'.. సిద్ధుకు పెద్ద సవాలే!

అయితే జాక్ మంచి పాఠాన్ని సిద్ధుకు నేర్పించిందనే చెప్పాలి. ఇప్పుడు తన కొత్త చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 April 2025 1:01 PM
తెలుసు కదా.. సిద్ధుకు పెద్ద సవాలే!
X

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టిల్లు సిరీస్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. కెరీర్ లో బెస్ట్ స్టేజ్ కు చేరుకున్నారు. దీంతో అందరి ఫోకస్ ఆయన అప్ కమింగ్ చిత్రాలపై పడింది. అదే సమయంలో రీసెంట్ గా జాక్ సినిమాతో వచ్చారు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా నిరాశపరిచింది. టిల్లు క్యారెక్టర్ కు తాను తప్ప ఎవరూ సెట్ కారు అన్నంతలా అలరించిన సిద్ధు.. జాక్ లోని ఏజెంట్ పాత్రలో ఇమడలేకపోయారు. టిల్లు మార్కే మళ్లీ కనపడడంతో అంతా నిరాశ చెందారు. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయినట్లు ప్రేక్షకులను మాత్రం సినిమా అస్సలు మెప్పించలేదు.

అదే సమయంలో జాక్ ప్రమోషన్స్ లో మిగతా హీరోల్లా సందడి చేయలేదు. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో ప్రమోట్ చేయలేదని అంతా అంటున్నారు. అయితే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాదని ముందే భావించారని, కానీ ఇంత ఫ్లాప్ అవుతుందని ఊహించి ఉండరని చెబుతున్నారు. ఏదేమైనా సిద్ధుకు జాక్ తో షాక్ తగిలింది.

అయితే జాక్ మంచి పాఠాన్ని సిద్ధుకు నేర్పించిందనే చెప్పాలి. ఇప్పుడు తన కొత్త చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు. ఆయన లైనప్ లో నెక్స్ట్ రిలీజ్ కు రెడీ అవుతున్న చిత్రం తెలుసు కదా. రొమాంటిక్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఆ మూవీని నీరజ కోన తెరకెక్కిస్తున్నారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఆ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా మూవీ షూటింగ్ జరుగుతుండగా.. రీసెంట్ గా సిద్ధు బర్త్ డే స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా అని మేకర్స్ తెలిపారు. సిద్ధు రోల్ కొత్తగా ఉంటుందని అన్నారు.

టిల్లు స్క్వేర్ తర్వాత జాక్ తో ఫ్లాప్ అందుకున్న స్టార్ బాయ్.. ఇప్పుడు తెలుసు కదా మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే మార్కెట్ దెబ్బతింటుంది. అదే సమయంలో టిల్లు వల్ల కొత్త పాత్రలు పండించడం సిద్ధుకు కష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో తెలుసు కదాతో ఆయనకు పెద్ద సవాలే ఎదురవ్వనంది. మరి ఎలా మెప్పిస్తారో.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.