సిద్దు జొన్నలగడ్డ.. బ్రేక్‌తో కొత్త ప్లాన్!
టాలీవుడ్‌లో ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన సిద్దు జొన్నలగడ్డ ఇటీవల ‘జాక్’ సినిమాతో షాక్ తిన్నాడు.
By: Tupaki Desk | 3 May 2025 12:30 PMటాలీవుడ్‌లో ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన సిద్దు జొన్నలగడ్డ ఇటీవల ‘జాక్’ సినిమాతో షాక్ తిన్నాడు. ఈ యాక్షన్ కామెడీ సినిమా సమ్మర్ లో మంచి స్లాట్ లో రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ తొలి రోజు నుంచే డిజాస్టర్‌గా నిలిచింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకర్షించలేకపోయింది.
అలాగే సిద్దు క్రియేటివ్ ఇన్వాల్వ్‌మెంట్, అతని భారీ రెమ్యునరేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కూడా ఆర్థికంగా ఈ సినిమాతో గట్టిగానే నష్టపోయాడు. అయితే ‘జాక్’ ఫెయిల్యూర్‌తో సిద్దు జొన్నలగడ్డ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ‘టిల్లు’ ఫ్రాంచైజీ విజయాల తర్వాత, ఈ సినిమా అతని ఇమేజ్‌ను దెబ్బతీసింది.
సినిమా కథ, ఎక్స్‌క్యూషన్‌లో లోపాలు, సిద్దు టిల్లు క్యారెక్టర్‌ను రిపీట్ చేసినట్లు ఫీలవడం వంటి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, సిద్దు తన నెక్స్ట్ స్టెప్స్‌పై జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. తన కొత్త సినిమా 'తెలుసు కదా' షూటింగ్ పూర్తి చేసిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించాడు. ‘తెలుసు కదా’ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. నీరజ కోన డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాపై ఇప్పటి వరకు పెద్దగా హైప్ అయితే లేదు. ఇక రిలీజ్ సమయానికి ప్రమోషన్ కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా తర్వాత సిద్దు ‘టిల్లు క్యూబ్’, ‘బాడస్’ సినిమాలపై దృష్టి పెడతాడు. కానీ, ఈ సినిమాల స్క్రిప్ట్‌లపై మరింత టైమ్ తీసుకుని, జాగ్రత్తగా పనిచేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
‘జాక్’ వివాదాలు, నష్టాల తర్వాత సిద్దు జొన్నలగడ్డ తన కెరీర్‌ను రీబిల్డ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ‘టిల్లు’ ఫ్రాంచైజీలో అతని కామెడీ టైమింగ్, స్వాగ్ అభిమానులను ఆకర్షించాయి. కానీ, ‘జాక్’లో ఆ మ్యాజిక్ మిస్ అయింది. ఈ సినిమాలో సిద్దు రా ఏజెంట్ రోల్‌లో కనిపించాడు, కానీ కామెడీ, సీరియస్‌నెస్ మధ్య బ్యాలెన్స్ కుదరలేదని విమర్శలు వచ్చాయి. ఈ అనుభవంతో సిద్దు తన స్క్రిప్ట్ సెలక్షన్‌పై మరింత ఫోకస్ చేస్తున్నాడు.