Begin typing your search above and press return to search.

మూవీ గురించే మూవీ.. సిద్ధు కొత్త ప్రాజెక్ట్ ఆన్ ది వే!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   6 July 2025 5:38 PM
మూవీ గురించే మూవీ.. సిద్ధు కొత్త ప్రాజెక్ట్ ఆన్ ది వే!
X

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. టిల్లు ఫ్రాంచైజీతో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ ఫ్రాంచైజీలో మరో సినిమా కూడా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


రీసెంట్ గా జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఆ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ.. సినీ ప్రియులను అస్సలు మెప్పించలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా తేలిపోయింది.

దీంతో తన రెమ్యునరేషన్ లో సగం కూడా వెనక్కి ఇచ్చేశారు. ఇప్పుడు తెలుసు కదా మూవీలో యాక్ట్ చేస్తున్నారు. నీర‌జ కోన ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఆ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఆ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడు సిద్ధు మరో కొత్త మూవీ అనౌన్స్మెంట్ రానుంది. ఆ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పరోక్షంగా ప్రకటించింది. నేడు ఓ క్రేజీ పోస్టర్ ను షేర్ చేసి.. ఇప్పుడు వారు నియంత్రించలేని వ్యక్తి.. జులై 9 అంటూ పోస్ట్ పెట్టింది. పోస్టర్ లో కెమెరాస్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. దీంతో అది సిద్ధు సినిమా ప్రకటనేనని నెటిజన్లు చెబుతున్నారు.

ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం తాను బదాస్ అనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సిద్ధు తెలిపారు. ఆ సినిమాలో యాక్టర్ రోల్ ను పోషిస్తున్నట్లు చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులను ద్వారా వివరిస్తామని అన్నారు. కృష్ణ అండ్ హిజ్ లీల డైరెక్టర్ రవిశంకర్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పుడు బదాస్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంటే సితార సంస్థ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పోస్టర్ బట్టి ఆ చిత్రమేనని అంతా ఊహిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. త్వరలో షూటింగ్ మొదలు కానుందని టాక్ వినిపిస్తోంది. మరి ఏ ప్రకటన వస్తుందో చూడాలి.