Begin typing your search above and press return to search.

చిన్నా కాదు మృగం అని పెడితే చూసేవాళ్లేమో..!

మధ్యలో కొన్నాళ్లు కేవలం కోలీవుడ్ కే పరిమితమైన సిద్ధార్థ్ శర్వానంద్ తో కలిసి మహా సముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   13 April 2024 2:04 PM GMT
చిన్నా కాదు మృగం అని పెడితే చూసేవాళ్లేమో..!
X

సౌత్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరైన సిద్ధార్థ్ రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత తెలుగులో పెద్దగా సక్సెస్ లు అందుకోలేదు. మధ్యలో కొన్నాళ్లు కేవలం కోలీవుడ్ కే పరిమితమైన సిద్ధార్థ్ శర్వానంద్ తో కలిసి మహా సముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే అభిరుచికి తగినట్టుగా తన ప్రొడక్షన్ లో సినిమాలు కూడా చేస్తున్నాడు సిద్ధార్థ్. లాస్ట్ ఇయర్ సిద్ధార్థ్ నటించిన చిత్తా సినిమా తెలుగులో చిన్నాగా రిలీజైంది. కోలీవుడ్ లో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో తన లైఫ్ లో మళ్లీ ఇలాంటి సినిమా తీద్దామనుకున్నా కుదరదు అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్.

ఇక రీసెంట్ గా కోలీవుడ్ లో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో మళ్లీ తన చిన్నా సినిమా మీద ప్రేమ చూపించాడు సిద్ధార్థ్. చిత్తా అని కాకుండా ఈ సినిమాకు మృగం అనే టైటిల్ పెట్టి ఉంటే ఆడియన్స్ చూసే వాళ్లేమో. కొందరు మగాళ్లు అలాంటి సినిమాలనే చూడాలని కోరుతున్నారు. చిన్నా లాంటి సినిమాలను వారు కోరుకోవట్లేదని అన్నాడు.

ఇన్ డైరెక్ట్ గా సిద్ధార్థ్ సందీప్ వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ సినిమా గురించి చెప్పాడు. అయితే ప్రేక్షకులు ఎలాంటి సినిమా ఇష్టపడాలి అన్నది వారి చాయిస్ దాన్ని జడ్జి చేసే అవసరం కానీ కెపాసిటీ కానీ ఎవరికీ లేదు. కానీ సిద్ధార్థ్ మాత్రం తను తీసిన సినిమా చూడలేదు కానీ కొందరు మగాళ్లకు యానిమల్ లాంటి సినిమాలు ఇష్టం అంటూ ఆడియన్స్ మీద ఒక స్టేట్ మెంట్ పాస్ చేశాడు. తన సినిమాను చూడమని చెప్పడం వరకు ఓకే కానీ వేరే సినిమాతో పోల్చి చెప్పడం అలాంటి సినిమాలు మాత్రమే చూస్తారని అనడం పై నెటిజన్లు సిద్ధార్థ్ కామెంట్స్ ని తప్పుపడుతున్నారు.

ప్రేక్షకులు నచ్చిన సినిమా అది ఎలాంటిదైనా సరే కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది అంటే సక్సెస్ అయినట్టే లెక్క. యానిమల్ లాంటి సినిమాలు చూసిన ఆడియన్స్ హనుమాన్ ను కూడా ఆదరించారు. తీసే సినిమాను బట్టి సినిమా ఫలితం ఉంటుంది కానీ ప్రేక్షకుల మీద ఒక మాట అనేస్తే మాత్రం వాళ్లు ఒప్పుకునే పరిస్థితి లేదు.