Begin typing your search above and press return to search.

బొమ్మరిల్లు సిద్దు, సూపర్ స్టార్ కిడ్ కలిసి..!

టాలీవుడ్‌ లో బొమ్మరిల్లు సినిమాతో పాటు పలు సినిమాలు హిట్ అవ్వడంతో సిద్దార్థ్‌ కి మంచి ఫాలోయింగ్‌ దక్కింది

By:  Tupaki Desk   |   27 Feb 2024 7:06 AM GMT
బొమ్మరిల్లు సిద్దు, సూపర్ స్టార్ కిడ్ కలిసి..!
X

టాలీవుడ్‌ లో బొమ్మరిల్లు సినిమాతో పాటు పలు సినిమాలు హిట్ అవ్వడంతో సిద్దార్థ్‌ కి మంచి ఫాలోయింగ్‌ దక్కింది. అయితే ఆ మధ్య కొన్ని కారణాల వల్ల తెలుగు లో సినిమాలు తగ్గించాడు. తమిళనాట కూడా పెద్దగా సినిమాలు చేయలేక పోయాడు. చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.

ఈ మధ్య మళ్లీ సిద్దార్థ్‌ ఫామ్‌ లోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు. తెలుగు లో కాకున్నా తమిళనాట సిద్ధార్థ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. చిత్త సినిమాతో ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దార్థ్‌ కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు.

సూపర్ స్టార్‌ రజినీకాంత్ కిడ్ అయిన ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో సిద్దార్థ్‌ హీరోగా ఒక సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఐశ్వర్య ఇటీవలే లాల్ సలామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా ఐశ్వర్య చెప్పిన కథ పై సిద్దార్థ్‌ నమ్మకంగా ఉన్నాడట.

వీరిద్దరి కాంబోకు సంబంధించిన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే విధంగా ఉంటుందట. దర్శకురాలిగా ఇప్పటికే పలు ప్రయత్నాలు చేసిన ఐశ్వర్య రజినీకాంత్ మరోసారి సిద్దార్థ్‌ తో కలిసి చేయబోతున్న ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవ్వనుంది అనేది చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి కానున్నాయి.