Begin typing your search above and press return to search.

శంక‌ర్ భారీత‌నం నిండిన పాట‌ల‌పై సిధ్ లీక్స్

ఇప్పుడు అంత‌కుమించి అనిపించేలా 'భార‌తీయుడు 2' పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సిద్ధార్థ్ లీకులు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   2 March 2024 5:30 PM GMT
శంక‌ర్ భారీత‌నం నిండిన పాట‌ల‌పై సిధ్ లీక్స్
X

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ ఎంత భారీత‌నంతో ఉంటుందో తెలిసిందే. కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ల‌ను కేవ‌లం పాట‌ల కోస‌మే వెచ్చిస్తారు. భారీ సెట్లు, అద్భుత‌మైన కాస్ట్యూమ్స్, ఆభ‌ర‌ణాలు, రాజీప‌డ‌ని మేక‌ప్, అద్భుత లొకేష‌న్లు స‌హా గ్రాఫిక్స్ లో మెరుపులు మిరుమిట్ల‌ కోసం అత్యంత భారీగా ఖ‌ర్చు చేయించ‌డం శంక‌ర్ కే చెల్లింది. జీన్స్, భార‌తీయుడు, బోయ్స్, శివాజీ, రోబో, 2.0, ఐ .. ఇలా ప్ర‌తి చిత్రంలో భారీత‌నం నిండిన పాట‌లు ప్ర‌జ‌ల్లో కొన్నేళ్ల‌పాటు చ‌ర్చ‌గా నిలిచాయి.

ఇప్పుడు అంత‌కుమించి అనిపించేలా 'భార‌తీయుడు 2' పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సిద్ధార్థ్ లీకులు ఇచ్చారు. సిద్ధార్థ్ కి ఇది కీల‌క‌మైన సినిమా కావ‌డంతో అత‌డు ఎంతో ఉత్కంఠ‌గా ఈ మూవీ విడుద‌ల‌ కోసం వేచి చూస్తున్నాడు. భారతీయుడు 2 తదుపరి పాట షూటింగ్ జరుగుతోందని సిధ్ తాజాగా వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్ లో భారీ డ్యాన్స్ పాట చిత్రీకరిస్తున్నార‌ని తెలిపాడు. అదే సమయంలో అంతర్జాతీయ కళాకారుడైన క‌మ‌ల్ హాస‌న్ తన డ్యాన్స్‌కు ప్రేరణ అని వెల్లడిస్తూ ప్రదర్శన వీడియోను కూడా షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఈ వారం ప్రారంభంలో ఇండియన్ 2 సెట్స్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కమల్ హాసన్ ఎత్తైన భవనాలపై సేనాపతిగా ఉన్న గ్రాఫిటీని ఆవిష్క‌రించ‌గా అది ఫ్యాన్స్ లో గొప్ప‌ చ‌ర్చ‌గా మారింది. తర్వాత సిద్ధార్థ్ తాజా ప్రకటన ఉత్కంఠ‌ను పెంచుతోంది. అదే సమయంలో అభిమానులకు సినిమాలోని గొప్పతనం గురించి మరో విష‌యం రివీలైంది.

భారతీయుడు 2 చిత్రీక‌ర‌ణ స్థిరమైన వేగంతో సాగుతోంది. మొత్తం షూటింగ్ త్వరలో ముగింపుకు వచ్చే అవకాశం ఉంది. కమల్ హాసన్ నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉండ‌గా, ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.

అవినీతి రాజ‌కీయాలు స‌హా నేటి స‌మాజంలోని చాలా రుగ్మ‌త‌ల‌ను భార‌తీయుడు 2లో శంక‌ర్ చూపించ‌బోతున్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఇందులో కమల్ హాసన్‌ను మరోసారి సేనాపతిగా క‌నిపించ‌నున్నారు. సూపర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ పుట్టినరోజుకు ముందు ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లై ఆకట్టుకుంది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇండియన్ 2 అనేది ఇండియన్ (1996)కి సీక్వెల్. కమల్ హాసన్ సేనాపతి పాత్రలో న‌టిస్తుండ‌గా, ఇందులో సిద్ధార్థ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, బాబీ సింహా, ఢిల్లీ గణేష్, సముద్రఖని, బ్రహ్మానందం, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటిస్తున్నారు. దివంగత నటులు నేదుమూడి వేణు, వివేక్, మనోబాల, జి. మరిముత్తును ఏఐలో చూపించ‌నున్నార‌న్న స‌మాచారం ఆస‌క్తిని రేకెత్తించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇండియన్ 2కి పాటలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కంపోజ్ చేస్తున్నారు. విక్రమ్ (2023) ఘ‌న‌విజ‌య త‌ర్వాత ఇండియ‌న్ 2 కోసం క‌మ‌ల్ హాస‌న్ త‌న ర‌క్తమాంసాల‌ను ఖ‌ర్చు చేసి హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు.