Begin typing your search above and press return to search.

#ఫైట‌ర్‌.. చేతులు ఎలా కాలాయో విశ్లేషించిన డైరెక్ట‌ర్

యుద్ధంలో ఓడాక ఎందుకు ఓడిపోయామో విశ్లేషించుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. 'ఫైట‌ర్' ఒక‌ ఓట‌మి పాలైన జెట్

By:  Tupaki Desk   |   3 Feb 2024 3:47 AM GMT
#ఫైట‌ర్‌.. చేతులు ఎలా కాలాయో విశ్లేషించిన డైరెక్ట‌ర్
X

సిద్ధార్థ్ ఆనంద్ 'ఫైటర్' బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే నంబర్‌లను తీసుకురావడంలో విఫలమైంది. ఇప్పుడు అలా ఎందుకు అయిందో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్వ‌యంగా విశ్లేషించారు.

యుద్ధంలో ఓడాక ఎందుకు ఓడిపోయామో విశ్లేషించుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. 'ఫైట‌ర్' ఒక‌ ఓట‌మి పాలైన జెట్. బాక్సాఫీస్ యుద్ధంలో ఈ సినిమా ఓట‌మి పాలైంది. అంతా ముగిసిన త‌ర్వాత ఇప్పుడు విశ్లేషించుకుని ఏం లాభం? నిన్న‌టిరోజున ఫైట‌ర్ వైఫ‌ల్యంపై త‌ర‌ణ్ ఆద‌ర్శ్ లాంటి క్రిటిక్ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. అనంత‌రం ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌ని తాను డిపెండ్ చేసుకుంటూ ఫైట‌ర్ వైఫ‌ల్యాన్ని విశ్లేషించిన ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్.. ఆల్మోస్ట్ రిగ్రెట్ ఫీల‌య్యాడు. ఇలాంటి కంటెంట్ ఎంపిక చేసుకుని త‌ప్పు చేసానా? అని క‌ల‌త‌కు గుర‌య్యాడు. 90 శాతం మంది విమానాల్లో ప్రయాణించని భారతీయ ప్రేక్షకులకు ఫైటర్ పూర్తిగా కొత్త త‌ర‌హా చిత్రం అని విశ్లేషించారు. దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాలి. 90శాతం ప్ర‌జ‌లు ఫైట‌ర్ ని వీక్షించేందుకు ఆసక్తిగా లేక‌పోవ‌డ‌మే ఈ వైఫ‌ల్యానికి కార‌ణ‌మ‌ని తేలిపోయింది.

ఫైటర్ జనవరి 25 న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రారంభ రోజున ఆశించిన స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించ‌లేదు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారిగా నటించారు. దీపిక స‌హా భారీ తారాగ‌ణం న‌టించారు. సాంకేతికంగా అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో తెర‌కెక్కింది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద వైఫ‌ల్యాన్ని చ‌వి చూసింది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ బాక్సాఫీస్ వైఫ‌ల్యంపై విశ్లేషించారు. 90శాతం మంది విమానాల్లో ప్రయాణించని భారతీయ ప్రేక్షకులకు ఫైటర్ పూర్తిగా కొత్త జాన‌ర్ సినిమా అని అన్నారు.

ఫైటర్ మ‌న‌కు పూర్తిగా కొత్త జాన‌ర్. దేశంలోని చిత్రనిర్మాతలు దీనిని ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌య‌త్నించ‌లేదు. ఇది ఏ త‌ర‌హా సినిమానో ఎవ‌రికీ తెలీదు. ప్రేక్షకులకు ఎటువంటి రిఫరెన్స్ పాయింట్ లేదు. అంటే వాళ్ళు చూసేది పూర్తిగా కొత్తది.. అంత పెద్ద స్టార్స్, కమర్షియల్ డైరెక్టర్.. కానీ ఈ విమానాలు ఏం చేస్తున్నాయి? అనే సందేహాలుంటాయి. మన దేశంలో 90శాతం మంది విమానాల్లో ప్రయాణించని వారు!ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లని వారు! కాబట్టి వారికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటారా? అంటూ విశ్లేషించారు.

ఈ సినిమా కంటెంట్ ని ఏలియ‌న్ త‌ర‌హా అని ప్ర‌జ‌లు భావించారు. దేశంలో ఎంతమందికి పాస్‌పోర్ట్ ఉంది? ఎంతమంది విదేశాల‌కు ప్రయాణించారు? విమానం ఎక్కిన‌ది ఎంత‌మంది? కానీ సినిమాలో విమానం చర్య గురించి మాట్లాడుతున్నాం. కానీ ప్రేక్ష‌కుల‌కు అదేమిటో అర్థం కాక‌పోవ‌డంతో ఆస్వాధించ‌లేక‌పోయారు. ప్రాథ‌మికంగా ఎవ‌రికీ అర్థం కాని ఎక్కని డిస్ క‌నెక్ష‌న్ ఏదో ఒక‌టి ఉంది అని అన్నారు. ఈ చిత్రం ఒక భావోద్వేగ కహానీ.. చాలా దేశీ కథ. ఇది ఒక కథగా అతి తక్కువ మందిని ఆక‌ర్షిస్తుంది. దాని శైలి చాలా కొత్తది అని నేను భావిస్తున్నాను. ప్రారంభ సంకోచంతో ఎవ‌రూ థియేట‌ర్ల‌కు రాలేదు.. అని విశ్లేషించారు.

భారత సాయుధ బలగాల త్యాగానికి, దేశభక్తికి నివాళిగా రూపొందించిన చిత్రం ఫైటర్. శ్రీనగర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాలకు ప్రతిస్పందనగా ఎయిర్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించిన ఎయిర్ డ్రాగన్స్ అనే కొత్త ఎలైట్ యూనిట్ చుట్టూ ఈ చిత్రం కథాంశం తిరుగుతుంది. హృతిక్, దీపిక ఎయిర్ డ్రాగ‌న్స్ టీమ్ స‌భ్యులుగా తెర‌పై క‌నిపించారు.