Begin typing your search above and press return to search.

అమ్మా నాన్నలకు క్యూట్‌ బేబీ లక్‌ హిట్‌ ఇచ్చేనా..!

బాలీవుడ్‌లో సిద్దార్థ్‌ మల్హోత్ర, కియారా అద్వానీ జంటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరి జంట చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు.

By:  Ramesh Palla   |   12 Aug 2025 1:00 PM IST
అమ్మా నాన్నలకు క్యూట్‌ బేబీ లక్‌ హిట్‌ ఇచ్చేనా..!
X

బాలీవుడ్‌లో సిద్దార్థ్‌ మల్హోత్ర, కియారా అద్వానీ జంటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరి జంట చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా వీరిద్దరూ తమ బేబీ కి వెల్‌కమ్‌ చెప్పారు. కియారా అద్వానీ బేబీ బంప్ ఫోటోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో తెలిసిందే. వీరిద్దరూ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కియారా అద్వానీ బిడ్డకు జన్మనిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. సోషల్‌ మీడియాలో వీరిద్దరి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న సమయంలో సిద్దార్థ్‌ మల్హోత్ర తమకు జులై 15, 2025న పాప జన్మించిందని అధికారికంగా ప్రకటించాడు.

కియారా అద్వానీ వార్‌ 2 తో రెడీ

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాప గురించి చర్చ జరుగుతోంది. ఆ పాపకు ఏం పేరు పెట్టారు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్‌ మీడియాలో ముఖ్యంగా బాలీవుడ్‌కి చెందిన కొందరు మీడియా వారి సోషల్‌ మీడియా హ్యాండిల్స్ లో ప్రముఖంగా చర్చ మొదలైంది. కియారా అద్వానీ నటిగా కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ అంతకు ముందే పూర్తి చేసిన వార్‌ 2 సినిమా విడుదలకు సిద్దం అయింది. ఆగస్టు 14న విడుదల కాబోతుంది. వార్‌ 2 సినిమా ఫలితంపై కియారా అద్వానీ యొక్క ఫ్యూచర్‌ ఆధారపడి ఉంటుంది. పోస్ట్‌ ప్రెగ్నెన్సీ ఫోటోలు ఇప్పటికే షేర్‌ చేసిన కియారా అద్వానీ పూర్వపు అందంతో ఆకట్టుకోవడం ఖాయం అని ఆ ఫోటోలతో చెప్పకనే చెప్పింది.

సిద్దార్థ్‌ మల్హోత్ర పరమ్‌ సుందరి

బేబీకి జన్మనిచ్చిన తర్వాత కియారా నుంచి రాబోతున్న సినిమా వార్‌ 2 కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు, ఆసక్తి ఉంది. బేబీ లక్‌ కలిసి వచ్చి కియారా అద్వానీ ఖచ్చితంగా వార్‌ 2 తో హిట్‌ కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఇక కియారా అద్వానీ మాత్రమే కాకుండా సిద్దార్థ్‌ మల్హోత్ర కూడా తన అదృష్టంను పరీక్షించుకునేందుకు ఈ ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పరమ్‌ సుందరి సినిమాతో ఈ నెల చివర్లో సిద్దార్థ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. పరమ్‌ సుందరి సినిమాకు ఉన్న పాజిటివ్‌ బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరమ్‌ సుందరి సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించడం ద్వారా అంచనాలు భారీగా పెరిగాయి.

జాన్వీ కపూర్ గ్లామర్‌ షో కోసం వెయిటింగ్‌

సిద్దార్థ్‌ మల్హోత్ర, కియారా అద్వానీలు తమ బేబీ లక్‌ తో ఆగస్టులో ఆ రెండు సినిమాలతో హిట్‌ కొట్టేనా అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్‌ 2 సినిమాలో హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించగా ఎన్టీఆర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వార్‌ 2 సినిమాకు ఉన్న పాజిటివ్‌ బజ్‌ నేపథ్యంలో రూ.100 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. లాంగ్‌ రన్‌లో వెయ్యి కోట్ల మూవీగా వార్‌ 2 నిలుస్తుందని అభిమానులు ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఇక సిద్దార్థ్‌ మల్హోత్ర సినిమా పరమ్‌ సుందరి సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పరమ్‌ సుందరి ఉంటుందని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆగస్ట్‌ 29న పరమ్‌ సుందరి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్‌ గ్లామర్‌ షో తో పరమ్‌ సుందరి వెయిట్‌ పెరిగింది. అందుకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అనేది చూడాలి.