సిద్ధార్ధ్‌కు ఏమైంది? ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు?
ఎప్పుడూ జాలీగా కనిపించే హీరో సిద్ధార్ధ్ ఫస్ట్ టైమ్ ఎమోషనల్ అయ్యాడు. అంతా చూస్తుండగానే మాట్లాడుతూ స్టేజ్‌పై ఏడ్చేశాడు.
By: Tupaki Desk | 27 Jun 2025 12:39 PM ISTఎప్పుడూ జాలీగా కనిపించే హీరో సిద్ధార్ధ్ ఫస్ట్ టైమ్ ఎమోషనల్ అయ్యాడు. అంతా చూస్తుండగానే మాట్లాడుతూ స్టేజ్‌పై ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్ధార్ధ్ నటించిన లేటెస్ట్ మూవీ `3BHK`. శ్రీగణేష్ దర్శకుడు. చిత్ర జె. అచర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీతా రఘునాథ్, సుబ్బు పంచు నటించారు.
తమిళంలో కథే హీరోగా రూపొందిన ఈ మూవీ జూలై 4న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగా చెన్నైలో ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న హీరో సిద్ధార్ధ్ స్టేజ్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన జీవితం, అలాగే కెరీర్‌లో తన తల్లదండ్రుల పాత్ర గురించి గుర్తు చేసుకుంటూ సిద్ధార్ధ్ ఎమోషనల్ అయ్యాడు.
`నా తల్లిదండ్రులు `3BHK`లో భాగం. దాని అర్థమేంటో నేను మీ అందరికి చెబుతాను. నేను సినిమాల్లో నా ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇది నా 40వ సినిమా. నేను దీని గురించి నా తల్లిదండ్రులతో పంచుకుంటున్నప్పుడు నా తండ్రి (సూర్యనారాయణన్) ముఖంలో గర్వం, శాంతం చూశాను` అన్నారు. అంతే కాకుండా `3BHK` నన్ను కదిలించిన భావోద్వేగ చిత్రం. ఈ సినిమాలో నన్ను అందరూ ఏడిపించారు. ఇదినా 40వ చిత్రమని సంతోషంగా, గర్వంగా చెప్పుకుంటాను.
నా తల్లిదండ్రులు నన్ను నమ్మారు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నా జీవితం బాగుండాలని ఎంతో డబ్బు ఖర్చు చేశారు` అంటూ సిద్ధార్ధ్ ఎమోషనల్ అయి స్టేజ్‌పైనే బోరున ఏడ్చేశారు. ఫస్ట్ టైమ్ సిద్ధార్ధ్ ఇలా స్టేజ్‌పై బోరున ఏడ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సినిమాల ఎంపిక విషయంలో పంథా మార్చుకున్న సిద్ధార్ధ్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. ఇటీవల చిన్న పాప కథతో `చిన్నా` మూవీని చేసిన సిద్ధార్ధ్ ఇప్పుడు ఫ్యామీలీకి సొంత ఇల్లు అనేది ఓ కల. దాన్నే ప్రధాన కథావస్తువుగా తీసుకుని భావోద్వేగాల సమాహారంగా `3BHK` మూవీని చేశాడు. ఇది జూలై 4న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.
