Begin typing your search above and press return to search.

ఒక ఫ్యామిలీ సొంతింటి కల.. సిద్ధార్థ్ 3 బి.హెచ్.కె ట్రైలర్ టాక్..!

3 బి.హెచ్.కె ట్రైలర్ చూస్తే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ సొంతిల్లు పొందేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా వారు పొందే అనుభూతులు చూపించారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 8:55 AM IST
ఒక ఫ్యామిలీ సొంతింటి కల.. సిద్ధార్థ్ 3 బి.హెచ్.కె ట్రైలర్ టాక్..!
X

బొమ్మరిల్లు సిద్ధార్థ్ నుంచి వస్తున్న మరో ఎమోషనల్ రైడ్ లాంటి మూవీ 3 బి.హెచ్.కె. శ్రీ గణేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ లీడ్ రోల్ లో నటించగా శరత్ కుమార్, మితిక రఘునాథ్, దేవయాని ఇంపార్టెంట్ రోల్స్ పోషించారు. శాంతి టాకీస్ బ్యానర్ లో అరుణ్ విశ్వ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. జూలై 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్.

3 బి.హెచ్.కె ట్రైలర్ చూస్తే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ సొంతిల్లు పొందేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా వారు పొందే అనుభూతులు చూపించారు. తల్లి తండ్రి కొడుకు కూతురు.. ఆ తండ్రికి సొంతిల్లు ఉండాలన్న కల. అతని చాలి చాలని జీతం ఆ కల నెరవేర్చలేదు. ఆ టైం లో కొడుకు కూడా కష్టపడాలని అనుకుంటాడు. కానీ అతనికి చదువు అబ్బదు. ఏదో ఒకటి చేసి నాన్న సొంతింటి కల నెరవేర్చాలని అనుకుంటాడు.

మరోపక్క ఆ ఇంటి ఆడబిడ్డ కూడా నాన్న కల కోసం జాబ్ చేస్తుంది. ఇలా ఒక తండ్రి సొంతింటి కల కోసం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేసిన జీవన యుద్ధాన్ని 3 బి.హెచ్.కె సినిమాలో చూపించనున్నారు. ట్రైలర్ లోనే కథ చెప్పేసిన దర్శకుడు కచ్చితంగా సినిమాను ఒక ఎమోషనల్ రైడ్ గా తీసుకెళ్లాడని అనిపిస్తుంది. మహావీరుడు సినిమాను డైరెక్ట్ చేసి సక్సెస్ పొందిన డైరెక్టర్ సాయి గణేష్ మరో ఫ్యామిలీ మూవీ అది కూడా సొంతింటి కల అనే కథాంశంతో వస్తున్నాడు. సినిమా ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. మరి సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి.

శ్రీ గణేష్ ఈ కథ ద్వారా ఒక మధ్య తరగతి వ్యక్తి తన సొంతింటి కల కోసం ఎంతగా కష్టపడతాడు అన్నది చూపించాడు. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని టచ్ చేయగలిగితే మాత్రం ఈ సినిమా చాలా గొప్ప విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఐతే ట్రైలర్ లో కథ చెప్పిన దర్శకుడు తన కథనం ద్వారా ప్రేక్షకులను మరింత రంజింపచేయాల్సి ఉంటుంది.