సిద్దార్థ్ విక్రమార్క ప్రయత్నం..!
ఐతే తమిళ్ లో తన మార్కెట్ కి తగినట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న సిద్ధార్థ్ తెలుగు మార్కెట్ ని మళ్లీ గాడిన పెట్టాలనే ఆలోచనతో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
By: Tupaki Desk | 24 Jun 2025 10:26 PM ISTతెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్లు కొట్టి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత గాడి తప్పాడు. తెలుగు ఆడియన్స్ తనని ఎంతో ప్రేమించినా కూడా తర్వాత సినిమాల వల్ల అతను వాళ్లని ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఐతే తెలుగులో వర్క్ అవుట్ అవ్వట్లేదని తమిళ పరిశ్రమకే అంకితమయ్యాడు సిద్ధార్థ్. అడపాదడపా అక్కడ చేసిన సినిమాలను కొన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఇక్కడ ఆడియన్స్ కి టచ్ లోకి వస్తుంటాడు.
తెలుగులో మహా సముద్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అది సక్సెస్ అయితే ఎలా ఉండేదో కానీ అది ఆశించిన స్థాయి లేకపోవడం వల్ల నెక్స్ట్ ఛాన్స్ లు రాలేదు. ఇక తన ప్రొడక్షన్ లో తెరకెక్కిన చిన్నా సినిమాకి కూడా తెలుగు నుంచి గొప్ప రెస్పాన్స్ ఊహించిన సిద్ధార్థ్ కి ఆశించిన రిజల్ట్ రాలేదు. ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 ఎందుకు చేశాడా అన్న డౌట్ వచ్చేలా చేశాడు.
ఐతే తమిళ్ లో తన మార్కెట్ కి తగినట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న సిద్ధార్థ్ తెలుగు మార్కెట్ ని మళ్లీ గాడిన పెట్టాలనే ఆలోచనతో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సిద్ధార్థ్ లేటెస్ట్ గా నటించిన కొత్త సినిమా 3 BHK సినిమా జూలై 4న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు వెర్షన్ ని అదే రోజు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
శ్రీ గణేష్ డైరెక్ట్ చేసిన 3 BHK సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా మూవీగా వస్తుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇంప్రెసివ్ గానే ఉంది. సిద్ధార్థ్ ఈ సినిమాను తెలుగులో కూడా ప్రేక్షకులకు చేరువయ్యేలా చూడాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే తెలుగులో ప్రమోషన్స్ కి సిద్ధమయ్యాడు. జూలై 4న నితిన్ తమ్ముడు వస్తుంది. ఆ సినిమాకు పోటీ కాదు కానీ 3 BHK సినిమా టాక్ మీదే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాను రీసెంట్ గా తమిళ్ లో హిట్టైన టూరిస్ట్ ఫ్యామిలీతో పోలుస్తూ ప్రమోట్ చేస్తున్నారు. మరి తెలుగు ఆడియన్స్ కు సిద్ధార్థ్ 3 BHK ఏమేరకు నచ్చుతుందో చూడాలి.
