Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర‌హాలో సిద్ధ‌రామ‌య్య‌ బ‌యోపిక్?

ఈ చిత్రానికి 'లీడర్ రామయ్య' అనే టైటిల్‌ను ఖరారు చేయగా, శశాంక్ శేషగిరి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:05 PM GMT
ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర‌హాలో సిద్ధ‌రామ‌య్య‌ బ‌యోపిక్?
X

రాజకీయ నాయకుడు సిద్ధరామయ్య బయోపిక్ గురించి కొంత‌కాలంగా మీడియాలో వ‌రుస‌ క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించనున్నట్లు కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా స‌మాచారం మేర‌కు.. సేతుప‌తి నుంచి అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ అందింది. కొత్త అప్‌డేట్ ప్ర‌కారం.. ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది.

సినిమా మొదటి భాగంలో సిద్ధరామయ్య లాయర్ అయ్యే వరకు బాల్యం యుక్త‌వ‌య‌సుపై సినిమా తెరకెక్కుతుంది. రెండో భాగంలో రాజకీయ నాయకుడిగా ఆయన జీవితంపై చిత్రీకరించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉండగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో చిన్న సిద్ధరామయ్య పాత్ర కోసం మేకర్స్ ఇంకా న‌టుడిని వెతుకుతున్నారు.

ఈ చిత్రానికి 'లీడర్ రామయ్య' అనే టైటిల్‌ను ఖరారు చేయగా, శశాంక్ శేషగిరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. విజయ్ సేతుపతి న‌టించిన 'జవాన్' విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో షారూఖ్, న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మహారాజా-గాంధీ టాక్స్-మెర్రీ క్రిస్మస్-VJS 51 వంటి కొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.

రాజ‌కీయాల్లో ఆయ‌న ప్ర‌స్థానం:

సిద్ధరామయ్య (జననం 3 ఆగష్టు 1947) జాతీయ కాంగ్రెస్ నాయ‌కుడు. ఆయ‌న‌ను స‌న్నిహితులు సిద్దూ అని కూడా పిలుస్తారు. ప్ర‌స్తుతం కర్ణాటకకు 24వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయ‌న‌ గతంలో 2013 నుండి 2018 వరకు ప‌ద‌విలో కొన‌సాగారు. క‌ర్నాట‌కలో ఐదేళ్ల కాలానికి ఆ పదవిలో ఉన్న‌ రెండవ వ్యక్తి. 2023 నుండి వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, గతంలో 2008 నుండి 2018 వరకు బాదామి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2018 నుండి 2023 వరకు చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి.. 2004 నుండి 2007 వరకు, 1994 నుండి 1999 వరకు 1983 నుండి 1989 వరకు కర్ణాటక అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.

అత‌డు జనతాదళ్ .. జనతాదళ్ (సెక్యులర్) సభ్యుడిగా ఉన్నప్పుడు 1996 నుండి 1999 వరకు ... 2004 నుండి 2005 వరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయ‌న‌ 2019 నుండి 2023 వరకు ... 2009 నుండి 2013 వరకు రెండు పర్యాయాలు కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాడు. సిద్ధరామయ్య చాలా సంవత్సరాలుగా వివిధ జనతా పరివార్ వర్గాలకు చెందిన సభ్యుడిగా సుప‌రిచితుడు.