Begin typing your search above and press return to search.

సితార DNA లోనే సినిమా

నా డిఎన్ ఏలోనూ ఓ భాగం. లెజెండ‌రీ..ఎవ్వెర్ గ్రీన్ సూప‌ర్ స్టార్ కృష్ణ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మాతాత గారు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ప్ర‌భావితం చేసారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 10:56 AM GMT
సితార DNA లోనే సినిమా
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్-న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార అప్పుడే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఓ జ్యూయెల‌ర‌నీ యాడ్ లో క‌నిపించింది. చ‌దువుకుంటూనే సితార సంపాద‌న మొద‌లు పెట్టింది. ఆర‌కంగా వెండి తెర అరంగేట్రానికి ముందే త‌న అభిరుచిని చాటి చెప్పింది. ఈ విష‌యంలో తల్లిదండ్రులు అంతే ప్రోత్స‌హిస్తున్నారు. పిల్ల‌ల‌కి ఇష్ట‌మైన రంగం వైపు వెళ్లే స్వేచ్ఛ త‌ల్లిదండ్రులుగా క‌ల్పిస్తామ‌ని మ‌హేష్-న‌మ్ర‌తలు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

అలా సితార మ‌న‌సు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలు కోరుకుంది. అందుకే సోష‌ల్ మీడియాలో యాక్టివిటీ కూడా ఆ వ‌య‌సులోనే స్పీడ‌ప్ చేసింది. జ్యూయెల‌రీ యాడ్ త‌ర్వాత సితార మ్యాక‌ప్ వేసుకోవ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా నేటి నేష‌న‌ల్ సినిమాడేని పుర‌స్క‌రించుకుని సితార సామాజిక మాధ్య‌మాల్లో ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. సినిమా అనేదానికి నాజీవితంలో ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది.

నా దృష్టిలో ఇది కేవ‌లం ఇండ‌స్ట్రీ మాత్ర‌మే కాదు. నా డిఎన్ ఏలోనూ ఓ భాగం. లెజెండ‌రీ..ఎవ్వెర్ గ్రీన్ సూప‌ర్ స్టార్ కృష్ణ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మాతాత గారు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ప్ర‌భావితం చేసారు. ఆయ‌న వార‌స‌త్వంలో భాగ‌మైనందుకు ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నా. మానాన్న ఏ విధంగా త‌న తండ్రి నుంచి స్పూర్తి పొందారో? నేను కూడా అలాగే న‌న్నా నుంచి స్పూర్తి పొందా' అని తెలిపింది.

దీంతో సితార పోస్ట్ చూసి అంతా స్ట‌న్ అవ్వాల్సిన ప‌నైంది. సితార ఇంత వ‌ర‌కూ పెద్ద త‌ర‌హా వ్యాఖ్య‌లు ఎక్క‌డా చేయ‌లేదు. చాలా సింపుల్ గా మాట్లాడి వ‌దిలేసేది. తొలిసారి సూప్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడ టంతో అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చూస్తుండ‌గానే సితాపాప ఇంత పెద్ద‌దైపోయిందా? అని మురిసిపోతున్నారు. ఇప్ప‌టికే సినిమాల‌పై సితార త‌న అభిప్రాయాన్ని పంచుకుంది. అవకాశం వ‌స్తే అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే న‌టిని అవుతాన‌ని తెలిపింది. డాన్సుల‌కు సంబంధించి ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటోంది.