Begin typing your search above and press return to search.

నేడే సమంత పెళ్లి.. అనుమానాలు రేకెత్తిస్తున్న శ్యామలీ పోస్ట్!

చలనచిత్ర పరిశ్రమలో రూమర్డ్ జంటగా చలామణి అవుతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   1 Dec 2025 10:29 AM IST
నేడే సమంత పెళ్లి.. అనుమానాలు రేకెత్తిస్తున్న శ్యామలీ పోస్ట్!
X

చలనచిత్ర పరిశ్రమలో రూమర్డ్ జంటగా చలామణి అవుతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు రాగా.. ఈరోజు ఊహించని ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నేడే వీరిద్దరి పెళ్లి అంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. సడన్ గా రాజ్ నిడిమోరు భార్య శ్యామలి పెట్టిన పోస్ట్ కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా ఒక చిన్న నోట్ పంచుకున్నారు. "తెగించిన వ్యక్తులు అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తారు" అంటూ శ్యామలి పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్తే.. కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్లో సమంత - రాజ్ నిడిమోరు వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి సమంత సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా ఈషా ఫౌండేషన్ కు వెళ్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. దాని వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ మానసిక ప్రశాంతతను పొందే ఈమె.. అక్కడే తన రెండో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు సమంత రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు.. అటు శ్యామలీ పెట్టిన పోస్ట్ అన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సమంత విషయానికి వస్తే.. ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ఏడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి.. దగ్గుబాటి రానా సహాయంతో పెద్దలను ఒప్పించి, ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఒకవైపు హిందూ సంప్రదాయంలో మరొకవైపు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది ఈ జంట. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా సాగిన వీరు సినిమాలు కూడా చేశారు.

ఇంతే సంతోషంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు అనుకున్న ఈ జంట అనూహ్యంగా పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అదే సమయంలో సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. వీటన్నింటిని అధిగమించడానికి కొంతకాలం విరామం ప్రకటించిన ఈమె మళ్లీ వెబ్ సిరీస్ లు , సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించి, నిర్మాతగా మారింది సమంత. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మించడమే కాకుండా అందులో లీడ్ రోల్ కూడా పోషిస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరొకవైపు రాజ్ దర్శకత్వం వహిస్తున్న రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది సమంత.