Begin typing your search above and press return to search.

బాబుకి పెళ్లి..దుర్గ‌మ్మ‌తో పాటు కృష్ణంరాజు ఆశీస్సుల‌తో!

ఈ నేప‌థ్యంలో తాజాగా దేవి న‌వ‌రాత్రులు సంద‌ర్భంగా దుర్గ‌మ్మ‌ని ద‌ర్శించుకున్న కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి ప్ర‌భాస్ పెళ్లి గురించి మాట్లాడారు. నేరుగా మీడియా ప్ర‌తినిధులు ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు? అంటూ అడిగారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 11:48 AM GMT
బాబుకి పెళ్లి..దుర్గ‌మ్మ‌తో పాటు కృష్ణంరాజు ఆశీస్సుల‌తో!
X

డార్లింగ్ ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు? అన్న‌ది ఓ మిస్ట‌రీ. ఆయ‌న పెళ్లిపై ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాలో ప్ర‌చారాలు త‌ప్ప‌! ఆ గ‌డియ‌లు ఎప్పుడు? అన్న‌ది ఎంత‌కీ క్లారిటీ లేని అంశం. హైద‌రాబాద్ అమ్మాయిని పెళ్లాడు తున్నాడా? భీమ‌వ‌రం పిల్ల‌తో కుదిరిందంటా? అన్న ప్ర‌చారం చాలా కాలంగా జ‌రుగుతోంది. చివ‌రికి మీడియా ఇంట‌ర్వ్యూల్లో..బాల‌య్య టాక్ షోల్లో సైతం పెళ్లి అంశం ఓ రేంజ్ లోవైర‌ల్ అయింది.

కృష్ణంరాజు ఉన్న స‌మ‌యంలో నేరుగా ఆయ‌న్నే అడిగి తేల్చుకుందామ‌నుకున్నా! అప్పుడు క్లారిటీ రాలేదు. దీంతో అస‌లు ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడా? 40 ప్ల‌స్ లో ఉన్నారంటూ అన్నిచోట్లా వాడి వేడి చ‌ర్చ సాగింది. చివ‌రికి బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ లా సింగిల్ గా ఉండిపో తాడా? అంటూ కొత్త ర‌కం క‌థ‌నాలు నెట్టింట తెర‌పైకి వ‌చ్చాయి. కొన్ని నెల‌లుగా ఈ టాపిక్ కూడా మీడియాలో పెద్ద‌గా వైర‌ల్ అవ్వ‌డం లేదు. టైమ్ వ‌చ్చిన‌ప్పుడు అదే అవుతుందులే అని నెటి జ‌నులు లైట్ తీసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా దేవి న‌వ‌రాత్రులు సంద‌ర్భంగా దుర్గ‌మ్మ‌ని ద‌ర్శించుకున్న కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి ప్ర‌భాస్ పెళ్లి గురించి మాట్లాడారు. నేరుగా మీడియా ప్ర‌తినిధులు ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు? అంటూ అడిగారు. అందుకు ఆవిడి దుర్గ‌మ్మ ఆశిస్సులున్నాయి....కృష్ణ‌రాజు గారి ఆశీస్సులు మాకు వెంట ఉన్నాయి. త‌ప్ప‌కుండా బాబు పెళ్లి అవుతుంది. ఆ పెళ్లి అంద‌రికీ చెప్పే చేస్తాం. మీడియా..అభిమానుల్ని త‌ప్ప‌కుండా ఆహ్వానిస్తాం' అని అన్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ విదేశాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కాలి స‌ర్జ‌రీ కార‌ణంగా కొన్ని నెల‌లుగా విదేశాల్లోనే ఉంటున్నారు. ఆయ‌న హీరోగా స‌లార్ రిలీజ్ కి రెడీ అవుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే నెల నుంచి ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెట్ట‌నున్నారు. అప్ప‌టి నుంచి డార్లింగ్ మీడియాలో రెగ్యుల‌ర్ గా క‌నిపించే అవ‌కాశం ఉంది. అలాగే క‌ల్కీ..మారుతి సినిమాల్ని కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.