Begin typing your search above and press return to search.

అందాల శ్వేత.. మిర్రర్ లో హై గ్లామర్ డోస్

అవి బాత్రూమ్ లో దిగిన ఫోటోలు కావడం విశేషం. బాత్రూమ్ లో మిర్రర్ ఎదురుగా మేకప్ వేసుకుంటూ, ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 12:30 PM GMT
అందాల శ్వేత.. మిర్రర్ లో హై గ్లామర్ డోస్
X

ఈ ఫోటోలో హీరోయిన్ గుర్తు పట్టారా? తొందరగా ఎవరూ మర్చిపోయే నటి కాదులేండి. పేరు శ్వేతా బసు ప్రసాద్. వరుణ్ సందేశ్ తో కలిసి కొత్త బంగారు లోకం సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత శ్వేత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆ మూవీ క్లిక్ అయినా కూడా శ్వేత బసు ప్రసాద్ కి తెలుగులో పెద్దగా ఆఫర్లు వచ్చింది లేదు. కొన్ని సినిమాలు తెలుగులో చేసింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు చేసి ఆకట్టుకుంది.


అయితే, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అవి బాత్రూమ్ లో దిగిన ఫోటోలు కావడం విశేషం. బాత్రూమ్ లో మిర్రర్ ఎదురుగా మేకప్ వేసుకుంటూ, ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే, ఆ మిర్రర్ లో నుంచి తన అందాలు స్పష్టంగా కనిపించేలా ఆమె ఫోజులు ఇవ్వడం విశేషం.


ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే, నిజానికి శ్వేత కెరీర్ మొదలుపెట్టినప్పుడు చాలా బొద్దుగా ఉండేది. కానీ, ఆ తర్వాత సన్నగా నాజుకుగా మారిపోయింది. అయితే, బొద్దుగా ఉన్నప్పటి అందం, ఇప్పుడు లేదనే చెప్పాలి.


శ్వేత ముంబైలోని శాంటాక్రూజ్‌లోని ఆర్ఎన్ పోడార్ హైస్కూల్‌ కామర్స్ స్కోర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మీడియా, జర్నలిజం కోర్సు చేసింది. మీడియా రంగంలో పని చేసిన తర్వాత, ఆమె గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు రాకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం చాలా సినిమాలే చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలు చేయడం విశేషం.

సినీ కెరీర్ మాత్రమే కాదు, ఆమె వైవాహిక జీవితం కూడా పెద్దగా ఆనందంగా సాగలేదు. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, కొంతకాలానికే వారు విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్ గా ఉంటున్న ఆమె, ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.