మీర్జాపూర్ నటిపై నెగెటివిటీ.. ట్రోలర్స్ ఓవర్ అయ్యారా లేక నిజమేనా?
శ్వేతా త్రిపాఠి కెరీర్‌లో మీర్జాపుర్ సిరీస్ చాలా స్పెషల్. 2018లో మొదలైన ఈ జర్నీలో ఆమె పోషించిన గోలు గుప్తా క్యారెక్టర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.
By: Madhu Reddy | 14 Jun 2026 11:45 AM ISTఅమెజాన్ ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ సిరీస్ 'మీర్జాపుర్'లో గోలు గుప్తా క్యారెక్టర్‌తో అలరించిన శ్వేతా త్రిపాఠి ప్రస్తుతం తన కెరీర్‌లో సరికొత్త ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఒకవైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మీర్జాపుర్ సీజన్ 4' కోసం వెయిట్ చేస్తూనే, మరోవైపు దాదాపు పదేళ్ల తర్వాత థియేటర్ స్టేజ్ పైకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, మీర్జాపుర్‌లో ఆమె పాత్ర మారిన తీరుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్, నెగెటివిటీపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
గోలు గుప్తా.. అమాయకత్వం నుండి అగ్రెసివ్ వరకు:
శ్వేతా త్రిపాఠి కెరీర్‌లో మీర్జాపుర్ సిరీస్ చాలా స్పెషల్. 2018లో మొదలైన ఈ జర్నీలో ఆమె పోషించిన గోలు గుప్తా క్యారెక్టర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇక మొదటి సీజన్‌లో చదువుకుంటూ చాలా పద్ధతిగా, అమాయకంగా కనిపించిన గోలు.. పూర్వాంచల్ క్రూరమైన పరిస్థితుల వల్ల ఆ తర్వాత కాలంలో ఒక సర్వైవర్‌గా, మొరటుగా మారిపోయింది.
ట్రోలర్స్ ఓవర్ అయ్యారా.. నిజమేనా?:
క్యారెక్టర్ మారిన తీరు అందరికీ నచ్చలేదు. కొందరు ప్రేక్షకులు మొదటి సీజన్ లోని క్లాస్ గోలునే ఇష్టపడ్డారు. ఆమె ఒక్కసారిగా గన్ పట్టి అంత అగ్రెసివ్‌గా మారడాన్ని తట్టుకోలేకపోయారు. ఇక ఆ మార్పు నప్పలేదంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్, నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. అయితే కథ డిమాండ్ మేరకే ఆ పాత్ర అలా మారిందని, ట్రోలర్స్ కాస్త ఓవర్ చేశారనేది మరికొందరి అభిప్రాయం.
నటిగా ఎదిగేందుకు హెల్ప్ అయ్యింది:
ఈ నెగెటివిటీని శ్వేతా చాలా పాజిటివ్‌గా తీసుకుంది. ఈ క్యారెక్టర్ గ్రాఫ్ వల్ల నటిగా తను ఎంతో ఎదిగానని ఆమె చెబుతోంది. ఇక ప్రేక్షకుల నుండి భిన్నమైన స్పందనలు వచ్చినప్పటికీ, ఒక నటిగా తన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి గోలు గుప్తా పాత్ర తనకు ఎంతో ఉపయోగపడిందని శ్వేతా స్పష్టం చేసింది.
పదేళ్ల తర్వాత మళ్లీ స్టేజ్ పైకి:
ఓటిటి ప్రపంచంలో బిజీగా ఉంటూనే, శ్వేతా త్రిపాఠి దాదాపు పదేళ్ల తర్వాత 'ఎక్స్‌టర్నల్ అఫైర్స్' అనే ప్లే ద్వారా మళ్లీ థియేటర్ ఆర్టిస్ట్‌గా రంగప్రవేశం చేసింది. ఈ అనుభవం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పింది. విశేషం ఏంటంటే, ఈ ప్లేలో ఆమె భర్త, ప్రముఖ రాపర్ చైతన్య శర్మ కూడా నటిస్తున్నారు.
సీజన్ 4 ఎప్పుడు రావచ్చు?:
ఈ ఏడాది అంటే 2026 మధ్యలో 'మీర్జాపుర్ సీజన్ 4' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిపై అధికారిక డేట్ రానప్పటికీ, ఈసారి గోలు గుప్తా కథ ఎలాంటి మలుపులు తిరగబోతుందోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
క్యారెక్టర్లు మారినప్పుడు విమర్శలు రావడం సహజం. మరి 'మీర్జాపుర్ 4' లోనైనా శ్వేతా త్రిపాఠి తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ట్రోలర్స్ నోళ్లు మూయిస్తుందో లేదో చూడాలి. ఇక ఏదేమైనా భర్తతో కలిసి స్టేజ్ షోస్ చేస్తూ, మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న శ్వేతకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే.
