Begin typing your search above and press return to search.

హాయ్ నాన్న శృతి కనిపించేది తక్కువే కానీ..!

సినిమా లో ఆమె పాత్ర కొద్దిసేపే అయినా చాలా ఇంప్యాక్ట్ కలిగించేలా ఉంటుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 5:30 PM GMT
హాయ్ నాన్న శృతి కనిపించేది తక్కువే కానీ..!
X

నేచురల్ స్టార్ నాని హీరో గా నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా కు హాయ్ నాన్న అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటుగా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా లో నాని మరోసారి ఫాదర్ రోల్ లో నటిస్తున్నాడు. హాయ్ నాన్న సినిమా లో మృణాల్ తో పాటుగా మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా నటిస్తుందని తెలిసిందే. ఈ సినిమాలో శృతి రోల్ ఏంటన్నది చిత్ర యూనిట్ చాలా సీక్రెట్ గా ఉంచుతుంది.

రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న ఫస్ట్ గ్లింప్స్ చూస్తే.. నానికి ఆల్రెడీ ఒక పాప ఉంటుంది ఆ పాపకి మృణాల్ దగ్గర అవుతుంది. సో అలా చూస్తే నాని భార్యగా శృతి హాసన్ కనిపించనుందన్నమాట. సినిమా లో ఆమె పాత్ర కొద్దిసేపే అయినా చాలా ఇంప్యాక్ట్ కలిగించేలా ఉంటుందని తెలుస్తుంది. నాని హాయ్ నాన్న సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇయర్ మొదట్లో దసరా తో సూపర్ హిట్ అందుకున్న నాని ఇయర్ ఎండింగ్ లో హాయ్ నాన్నతో మరో హిట్ ఖాతా లో వేసుకోవాలని చూస్తున్నాడు.

హాయ్ నాన్న సినిమా నాని నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఎంటర్టైన్ తో పాటుగా మంచి ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తుంది. నాని మృణాల్ ఎపిసోడ్స్ అలరించేలా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు నాని శృతి హాసన్ మధ్య సీన్స్ చాలా బాగుంటాయని ఆ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. నాని 30వ సినిమాగా వస్తున్న హాయ్ నాన్న మీద నేచురల్ స్టార్ చాలా హోప్స్ తో ఉన్నాడు.

కెరీర్ లో ఫస్ట్ టైం ధరణిగా ఊర మాస్ రోల్ లో మెప్పించిన నాని మరోసారి తన స్టైల్ రోల్ లో వస్తున్నాడు. హాయ్ నాన్న సినిమా కు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మలయాళం లో హృదయం సినిమాకు సూపర్ మ్యూజిక్ అందించిన అతను తెలుగు లో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని హాయ్ నాన్నకు మ్యూజిక్ అందిస్తున్నాడు. సో హాయ్ నాన్న మ్యూజికల్ గా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. నాని హాయ్ నాన్న సినిమా క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్.