సారా టెండూల్కర్‌తో డేటింగ్‌పై గిల్ స్పందన
ప్రస్తుతానికి తాను ఆటపైనే దృష్టి సారించానని, ప్రేమ పేరుతో చిక్కుల్లో పడలేనని కూడా అన్నాడు.
By: Tupaki Desk | 27 April 2025 5:46 AMటీమిండియా ట్యాలెంటెడ్ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నాడని చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. 25 ఏళ్ల యువకుడు డేటింగ్ చేయడం వింతేమీ కాదు కానీ, అది సచిన్ కుమార్తె కావడంతో ఈ జంట గురించి ఎండ్ లెస్‌గా చాలా చర్చ సాగుతోంది. ఈ జోడీ ఎంతో బావుంటుందని, వారు పెళ్లి చేసుకోవాలని కోరుకున్న అభిమానులు ఉన్నారు.
కానీ విధి విచిత్రమైనది. ప్రతి పుకార్ నిజం కావాలని రూలేమీ లేదు. ఇప్పుడు గిల్ కూడా ఇదే అంటున్నాడు. అతడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను మూడు సంవత్సరాలకు పైగా ఒంటరిగా ఉన్నానని, చాలా ఊహాగానాలు, పుకార్లు ఉన్నాయని, నన్ను వేర్వేరు అమ్మాయిలతో ముడిపెట్టి గాసిప్స్ ప్రచారం చేస్తున్నారని అతడు అన్నాడు. కొన్నిసార్లు, నేను నా జీవితంలో ఎప్పుడూ కలవని చూడని వ్యక్తితోను ముడిపెడుతున్నారు! అని ఆవేదన చెందాడు.
ప్రస్తుతానికి తాను ఆటపైనే దృష్టి సారించానని, ప్రేమ పేరుతో చిక్కుల్లో పడలేనని కూడా అన్నాడు. మేము సంవత్సరానికి దాదాపు 300 రోజులు ఎక్కడికో ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఎవరితోనైనా ఉండటానికి సంబంధం కొనసాగించడానికి అవసరమైన సమయం లేదు అని అన్నాడు. గిల్ పాపులర్ బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ తోను ప్రేమలో ఉన్నాడని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ 2025 సీజన్‌లో గిల్ వరుసగా రెండవ సంవత్సరం గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.