Begin typing your search above and press return to search.

సమంత శుభం ప్లాన్ అదుర్స్..!

ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ గా మాత్రమే ఉన్న సమంత ఇక మీదట నిర్మాతగా కూడా తన సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. సమంత నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నమే శుభం.

By:  Tupaki Desk   |   27 April 2025 10:23 PM IST
సమంత శుభం ప్లాన్ అదుర్స్..!
X

ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ గా మాత్రమే ఉన్న సమంత ఇక మీదట నిర్మాతగా కూడా తన సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. సమంత నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నమే శుభం. నిర్మాతగా తొలి సినిమాతోనే తన టేస్ట్ ఏంటన్నది చూపించేలా చేస్తుంది సమంత. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అదే ఇంట్లో ఉండే మహిళలకు టీవీ సీరియల్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అలా సీరియల్ బ్యాక్ డ్రాప్ కథతో టీవీలో సీరియల్ చూశాక మహిళలు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడమే ఈ శుభం సినిమా కథగా వస్తుంది.

నిర్మాతగా మొదటి సినిమానే ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో వస్తుంది సమంత. శుభం ట్రైలర్ చూసిన ఎవరైనా అది ఒప్పుకోక తప్పదు. ప్రవీణ్ కండ్రేగుల ఒక వెరైటీ కథతో శుభం సినిమా తీశారు. ఐతే లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ లో చివర్లో సమంత సర్ ప్రైజ్ చేసింది. సినిమాలో సమంత ఉంటుందని ముందు నుంచి వార్తలు వచ్చినా ట్రైలర్ లో సమంతని రివీల్ చేయడం పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.

అసలైతే డైరెక్ట్ గా థియేటర్ లో సమంత సినిమాలో ఉంటుందని రివీల్ చేయొచ్చు. కానీ ఈ సినిమాలో సమంత ఉంది అని ముందు తెలిస్తేనే టికెట్లు తెగుతాయని ప్లాన్. సో సమంత తప్పకుండా శుభం సినిమా విషయంలో సమంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ లాక్ చేశారు. ఆ డేట్ న వచ్చిన ఎన్నో సినిమాలు సంచలనాలు సృష్టించాయి. మరి సమంత శుభం ని ఆమె ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తారన్నది చూడాలి.

ఇక సమంత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా తర్వాత మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. కానీ నిర్మాతగా ఆమె మాత్రం తొలి ప్రయత్నం మాత్రం తెలుగులోనే చేస్తుంది. సమంత కూడా మంచి కథ దొరికితే చేయాలని అనుకుంటున్నా ఆమెకు తగిన స్టోరీస్ రావట్లేదని తెలుస్తుంది. మరోపక్క అమ్మడు బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లు చేస్తుంది. సిటాడెల్ తో అలరించిన సమంత మరో సీరీస్ కు సైన్ చేసిందని టాక్. ఐతే తెలుగులో కూడా సమంత నెక్స్ట్ అప్డేట్ త్వరలో వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.