బుల్లితెర మీద శుభలగ్నం సీన్.. విజిల్స్ అంతే..!
ఐతే ఆఫ్టర్ ఇయర్స్ మళ్లీ శుభలగ్నం సినిమాను రీ క్రియేట్ చేశారు. శుభలగ్నం సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డ్రామా జూనియర్స్ లో ఆ సినిమా స్టార్స్ ని తీసుకొచ్చారు.
By: Tupaki Desk | 18 April 2025 6:33 PM ISTఫ్యామిలీ హీరో జగపతి బాబు సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఇష్టం. ఒకప్పుడు జగపతి బాబు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఉండేవారు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ జగపతి బాబుకి చాలా ఎక్కువగా ఉండేది. ఆయన కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలనే చేస్తూ వచ్చారు. అలా ఆయన చేసిన సూపర్ హిట్ ఫ్యామిలీ సినిమాల్లో ఒకటి శుభలగ్నం. 1994 లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఎస్వీ కృష్ణా రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన శుభలగ్నం సినిమాలో ఆమని, రోజా హీరోయిన్స్ గా నటించారు. డబ్బు ఆశ ఉన్న మహిళ ఏకంగా తన భర్తనే అమ్మేసిన కథతో శుభలగ్నం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగా అలరించిందో తెలిసిందే. జగపతి బాబు, ఆమనిది అప్పట్లో హిట్ పెయిర్. అలానే జగపతి బాబు రోజాల జోడీ కూడా అలరించింది.
ఐతే ఆఫ్టర్ ఇయర్స్ మళ్లీ శుభలగ్నం సినిమాను రీ క్రియేట్ చేశారు. శుభలగ్నం సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డ్రామా జూనియర్స్ లో ఆ సినిమా స్టార్స్ ని తీసుకొచ్చారు. జీ తెలుగు డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ లో శుభలగ్నం సీన్స్ రీ క్రియేట్ చేశారు. జగపతి బాబు, ఆమని, రోజా కలిసి శుభలగ్నం సీన్స్ మళ్లీ రీ క్రియేట్ చేయడం విశేషంగా మారింది. దీనికి సంబంధించిన ప్రోమో జీ తెలుగు లేటెస్ట్ గా రిలీజ్ చేయగా ఆ సినిమాను ఇష్టపడిన అప్పటి ఫ్యాన్స్ అంతా సూపర్ అనేస్తున్నారు.
శుభలగ్నం సినిమాను ఇప్పటికీ ఒక మంచి క్లాసిక్ సినిమాగా ఆడియన్స్ చూస్తుంటారు. ఆ సినిమాలో నటించిన జగపతి బాబు, ఆమని, రోజా ఇలా మళ్లీ బుల్లితెర మీద ఆ సినిమాలోని సీన్స్ ని రీ టేక్ రూపంలో నటించడం క్రేజీగా ఉందని చెప్పొచ్చు. బుల్లితెర ఆడియన్స్ కి ఈ ఎపిసోడ్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. జగపతి బాబు ఇప్పుడు స్పెషల్ రోల్స్ తో తన సత్తా చాటుతుండగా రోజా కంప్లీట్ గా పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. ఆమని సినిమాలకు ఆమధ్య కొంత గ్యాప్ ఇచ్చినా మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి శుభలగ్నం ఫ్యామిలీ చేసే హంగామా ఈ వీకెండ్ డ్రామా జూనియర్స్ ఎపిసోడ్ కి సూపర్ హిట్ వ్యూస్ తెప్పిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
