డైరెక్టర్ పేరు లేకుండానే తొలి రిలీజ్ ఇదే!
రాజేశేఖర్-వడ్డే నవీన్ `శుభకార్యం` అనే సినిమా చేసారు. అది 2001 లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.
By: Tupaki Desk | 27 Jun 2025 8:30 AM ISTఏ సినిమా రిలీజ్ కైనా డైరెక్టర్ పేరుంటుంది. టైటిల్స్ కార్డులో కచ్చితంగా అతడి పేరు పడుతుంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి డైరెక్టర్ లేనిదే సినిమానే ఉండదు. సినిమాకు డైరెక్టరే గుండెకాయ లాంటి వాడు. క్రి యేటివ్ గా పనిచేయడంతో పాటు 24 శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించేది దర్శ కుడు మాత్రమే. అందుకే ఎంత పెద్ద హీరో అయినా? దర్శకుడు మాటకు కట్టుబడి ఉంటాడు. డైరెక్టర్ ఎంత ప్రతిభావంతుడైతే? అంతటి కీర్తి లభిస్తుంది.
అందుకే టైటిల్స్ కార్డులో అన్ని పూర్తయిన తర్వాత చివర్లో డైరెక్టర్ పేరు మాత్రమే పడుతుంది. ప్రారంభా నికి ముందు హీరో పేరు ఎలాగో..టైటిల్స్ కార్డు ముగింపులో డైరెక్టర్ పేరు అంతే కీలకం. అయితే ఎలాంటి డైరెక్టర్ పేరు లేకుండా రిలీజ్ అయిన సినిమా ఒకటుంది తెలుసా? అవును. ఆ సినిమా టైటిల్స్ కార్డులో అందరి పేర్లు ఉంటాయి. కానీ చివర్లో డైరెక్టర్ పేరుండదు. ఇంతకీ ఏంటా సినిమా అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
రాజేశేఖర్-వడ్డే నవీన్ `శుభకార్యం` అనే సినిమా చేసారు. అది 2001 లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్ నిర్మించారు. అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలో రాజశేఖర్- రవిరాజా పినిశెట్టి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయట. దీంతో సినిమా పూర్తి చేయకుం డానే రవిరాజా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారుట. ఆయన తప్పుకోవడంతో అప్పటికప్పుడు ఆ స్థానంలోకి `బొబ్బిలి వంశం` ఫేమ్ అదియమాన్ తీసుకొచ్చారుట.
మిగతా సినిమాను అతడు పూర్తి చేసాడు. పూర్తయిన క్రమంలో రవిరాజా వచ్చి దర్శకుడిగా తన పేరు టైటిల్ కార్డులో ఉండాలని పట్టుబట్టాడుట. అప్పట్లో ఇది పెద్ద వివాదాస్పదమైందిట. పంచాయతీకి కూడా వెళ్లినట్లు తెలిసింది. దీంతో నిర్మాత ఏ దర్శకుడు పేరు టైటిల్ కార్డులో వేయకుండానే చిత్రాన్ని రిలీజ్ చేసారుట.
