Begin typing your search above and press return to search.

డెకాయిట్ కోసం శృతి సాలిడ్ రెమ్యునరేషన్

ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం శృతి హాసన్ కి ఏకంగా 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. గత సినిమాలకి 2.5 కోట్ల వరకు శృతి హాసన్ ఛార్జ్ చేసింది.

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:48 AM GMT
డెకాయిట్ కోసం శృతి సాలిడ్ రెమ్యునరేషన్
X

శృతి హాసన్ ఈ మధ్యకాలంలో సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న టైం చూసుకొని ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలలో శృతి హాసన్ కనిపించింది. ఈ రెండు సినిమాలలో ఆమె పాత్రలకిపెద్దగా స్కోప్ ఉండదు. కొద్దిలో కొద్ది వాల్తేర్ వీరయ్యలో పర్లేదని చెప్పాలి.

చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా డెకాయిట్ అనే మూవీ టీజర్ తో శృతి హాసన్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అడవి శేష్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాడు. వీరిద్దరూ జోడీగా డెకాయిట్ చిత్రాన్ని షానిల్ దేవ్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ మూవీస్ సంయుక్తంగా ఈ యాక్షన్లవ్ స్టోరీని నిర్మిస్తున్నాయి.

తాజాగా టీజర్ లో చూపించిన కంటెంట్ బట్టి శత్రువులుగా మారిన ఇద్దరు ప్రేమికుల కథగా డెకాయిట్ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం శృతి హాసన్ కి ఏకంగా 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. గత సినిమాలకి 2.5 కోట్ల వరకు శృతి హాసన్ ఛార్జ్ చేసింది.

అయితే డెకాయిట్ మూవీ కోసం ఎక్కువ మొత్తం ఇస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండబోతోంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా శృతి హాసన్ పై చిత్రీకరించనున్నారంట. అలాగే అడవి శేష్, శృతి హాసన మధ్య వచ్చి సన్నివేశాలు చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాదికి డెకాయిట్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే మరో వైపు గూఢచారి 2 మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకి సంబందించిన కీలక ఎపిసోడ్స్ ఫారిన్ లో షూట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు 2024 ఎండింగ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.