Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్సులో శృతి మైండ్ బ్లోయింగ్

ఏడాదిలో మూడు సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్న కూడా శృతి హాసన్ సినిమాల పరంగా స్పీడ్ లేదు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 11:59 AM GMT
బ్లాక్ డ్రెస్సులో శృతి మైండ్ బ్లోయింగ్
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ఏడాది సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య, బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఏడాది ఆఖరులో సలార్ మూవీతో మరో సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఏడాదిలో మూడు సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్న కూడా శృతి హాసన్ సినిమాల పరంగా స్పీడ్ లేదు.


సెలక్టివ్ గానే మూవీస్ చేస్తోంది. ఎక్కువ టైం తన మ్యూజిక్, ఫ్యాషన్ ఈవెంట్స్, బాయ్ ఫ్రెండ్ కోసం స్పెండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు డెకాయిట్ అనే సినిమాలో నటిస్తోంది. అడవి శేష్ ఈ చిత్రంలో శృతి హాసన్ కి జోడీగా నటిస్తున్నాడు. యాక్షన్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. సలార్ పార్ట్ 2 కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయిన కథ నేరేషన్ మొత్తం శృతి హాసన్ పాత్ర మీదనే నడుస్తుంది.


ఈ అమ్మడు రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. లక్షల్లో లైక్స్ సొంతం చేసుకుంటాయి. కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో శృతి హాసన్ కవ్వించే అందాలు ఆమె ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తూ ఉంటాయి. తాజాగా బ్లాక్ ఫ్రాక్ లో హాట్ ఫోటోషూట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


స్టైలిష్ ఫోజులుతో థైస్ అందాలు కనిపించే విధంగా హాట్ లుక్స్ తో శృతి హాసన్ ఈ పిక్స్ లో కట్టిపడేస్తోంది. ఈ ఫోటోలకి ఏకంగా 1.12 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే కామెంట్స్ కూడా వచ్చాయి. శృతి హాసన్ అందాలని వర్ణిస్తూ ఫ్యాన్స్ డిఫరెంట్ ఎమోజీ లతో కామెంట్స్ పెడుతున్నారు.


దీనిని బట్టి అమ్మడు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే ఎలాంటి కుర్రాడయిన ఫిదా కావాల్సిందే అనిపించేలా శృతి హాసన్ బ్లాక్ ఫ్రాక్ లో అందంతో మెరిసిపోతూ ఉండటం విశేషం.