Begin typing your search above and press return to search.

ఆగంత‌కుడి చేష్ట‌లతో భ‌య‌ప‌డిన శ్రుతిహాస‌న్!

హీరోయిన్ శ్రుతి హాస‌న్ కి మాత్రం ఓ వింత అనుభ‌వం ఎదురైంది. అమ్మ‌డు ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ఓ ఆగంత‌కుడు ఆమెని వెంబ‌డించాడు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 2:01 PM GMT
ఆగంత‌కుడి చేష్ట‌లతో భ‌య‌ప‌డిన శ్రుతిహాస‌న్!
X

హీరోయిన్ శ్రుతి హాస‌న్ కి మాత్రం ఓ వింత అనుభ‌వం ఎదురైంది. అమ్మ‌డు ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ఓ ఆగంత‌కుడు ఆమెని వెంబ‌డించాడు. ఆమెని వెంబ‌డించి కారు పార్కింగ్ వ‌ద్ద మాట్లాడే ప్ర‌య‌త్నం చేసాడు. నువ్వు ఎవ‌రో నాకు తెలియ‌దు అని శ్రుతి హాస‌న్ మొత్తుకున్నా ఆ దుండ‌గుడు విన‌లేదు. ఎంత వారించినా ఆమె మాట విన‌లేదు. న‌ల్ల‌టి చొక్కా..నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధ‌రించాడు.

అత‌డి వాల‌కం చూసిఆందోళ‌న గురైంది. ఇత‌నెవ‌రు ? ఇలా వెంబ‌డిస్తున్నాడ‌ని ఆందోళ‌న ప‌డింది. చుట్టూ త‌న స్టాప్ ఉన్నా ఏమీ చేయ‌లేని నిస్స‌హ‌య‌రాలు అయింది. చివ‌ర‌కు ఎలాగూ అత‌ని బారి నుంచి త‌ప్పించుకుని అక్క‌డ నుంచి కారెక్కి వెళ్లిపోయింది. హీరోయిన్ల‌కు అప్పుడ‌ప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. అభిమానంతో కొంత‌వ‌ర‌కూ ప‌ర్వాలేదు.కొన్నిసార్లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తేనే ఇబ్బంది.

తాజాగా శ్రుతిహాస‌న్ అలాంటి ఇబ్బందికే గురైన‌ట్లుంది. అమ్మ‌డు సైమా అవార్డుల కోసం దుబాయ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. తిరుగు ప్ర‌యాణంలో భాగంగా ముంబైలో ల్యాండ్ అయింది. అక్క‌డ నుంచి నేరుగా చెన్నై చేరుకుంటుంది. సాధార‌ణంగా జ‌నాల్లోకి వ‌స్తే సెల‌బ్రిటీల‌కు ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. సెల్పీలు.. సంత‌కా లు అంటూ మీద‌న‌ప‌డ‌తారు. ఇదంతా అభిమానంతో చేసేదే అయినా...ఆ కార‌ణంగా వాళ్లు ఎంత ఇబ్బంది ప‌డ‌తారో! ప‌డ్డ వాళ్ల‌కే తెలుస్తుంది.

అందుకే ఒక్కోసారి స్టార్ హీరోలు కూడా స‌హ‌నం కోల్పోతుంటారు. కాళ్ల మీద‌న ప‌డే వాళ్ల‌ని కూడా ఈడ్చి పారేస్తుంటారు. కొంద‌రైతే ఏకంతా కోప‌గించుకుంటారు..చేయి చేసుకుంటాటారు. ఆ త‌ర్వాత అన‌వ‌స‌రంగా తొంద‌ర‌ప‌డ్డామ‌ని బాధ‌ప‌డుతుంటారు. ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ 'స‌లార్'..'హాయ్ నాన్న‌'..'ది ఐ' లాంటి చిత్రాల్లో న‌టిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ హీరోల‌తోనూ సై అంటున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అమ్మ‌డు సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది.