Begin typing your search above and press return to search.

'స‌లార్' కోసం శ్రుతి హాస‌న్ చివ‌రి అంకం!

నేను ఏ సినిమాకి డ‌బ్బింగ్ చెబుతున్నానో గెస్ చేయండి అంటూ పోస్ట్ పెట్టింది. అలాగే అమ్మ‌డు స్టూడియో నుంచి ఓ ఫోటో కూడా షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 3:13 PM GMT
స‌లార్  కోసం శ్రుతి హాస‌న్ చివ‌రి అంకం!
X

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ప్రశాంత్ నీల్ 'స‌లార్' ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు భారీ అంచ‌నాలు క్రియేట్ చేస్తున్నాయి. ప్ర‌భాస్ మాస్ లుక్...యాక్ష‌న్ స‌న్నివేశాలు అంత‌కంత‌కు అంచ‌నాలు పెంచేస్తున్నాయి.


దీతో అభిమానులు సెప్టెంబ‌ర్ 28 ఎప్పుడొస్తుందా? అని ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈసినిమాకి సంబంధించి లీడింగ్ లేడీ శ్రుతిహాస‌న్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించింది. 'స‌లార్' లో త‌న పాత్ర‌కి సంబంధించి డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ట్లు తెలిపింది. డ‌బ్బింగ్ స్టూడియో నుంచి ఓ ఫోటోని అభిమానుల‌లో పంచుకుంది. నేను ఏ సినిమాకి డ‌బ్బింగ్ చెబుతున్నానో గెస్ చేయండి అంటూ పోస్ట్ పెట్టింది. అలాగే అమ్మ‌డు స్టూడియో నుంచి ఓ ఫోటో కూడా షేర్ చేసింది. అయితే ఈ విష‌యాన్ని దృవీక‌రించాల్సి ఉంది.

ఇక ఈ సినిమాకి ఇప్ప‌టికే డార్లింగ్ డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేసాడ‌ని ప్ర‌చారంలో ఉంది. 'ప్రాజెక్ట్ -కె'కి అంత‌రాయం లేకుండా ముందుగా 'స‌లార్' యూనిట్ డ‌బ్బింగ్ ప‌నులు ముగించిన‌ట్లు వినిపిస్తుంది. దీంతో స‌లార్ నుంచి ప్ర‌భాస్ బాధ్య‌త‌లు అన్ని పూర్తి చేసిన‌ట్లు అయింది.

ఇక రిలీజ్ స‌మ‌యంలో ప్రచార కార్య‌క్ర‌మాల్లోనే పాల్గొనాల్సి ఉంటుంది. పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న సినిమా నేప‌థ్యంలో అన్ని భాష‌ల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం ప్లాన్ చేస్తున్నారు.

బాలీవుడ్ తో పాటు క‌న్న‌డ ప్ర‌చారంపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ కి ఆ రేంజ్ సక్సెస్ ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. సాహో..రాదేశ్యామ్ భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో 'స‌లార్' ని టార్గెట్ చేసి ముందుకెళ్లారు.