Begin typing your search above and press return to search.

డార్లింగ్ గురించి శ్రుతిహాస‌న్ మ‌న‌సులో మాట‌!

సినిమాలో పాత్ర‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం..పాత్ర‌లో ఒదిగిపోయే విధానం న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మంచి స‌హ న‌టుడు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 2:30 PM GMT
డార్లింగ్ గురించి శ్రుతిహాస‌న్ మ‌న‌సులో మాట‌!
X

డార్లింగ్ ప్ర‌భాస్ తో ప‌నిచేసిన హీరోయిన్లు అంతా ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకొస్తుంటారు. ముఖ్యంగా ఆయ‌న ఇంటి నుంచి వ‌చ్చే పుడ్ గురించి చెప్ప‌ని హీరోయిన్ అంటూ ఉండ‌దు. ఇప్ప‌టికే శ్రుతి హాస‌న్ అలాంటి పుడ్ విష‌యాలు రివీల్ చేసేసింది. ఆయ‌న ఇంటి రుచులు ఎంత బాగుంటాయో? తాను ఎంత‌గా ఆస్వాదించి రుచి చూసిందో చెప్ప‌క‌నే చెప్పింది. మ‌రి డార్లింగ్ గురించి ఆమె వ్య‌క్తిగ‌తంగా మ‌న‌సులో మాట ఏంటి? అంటే కూల్ అండ్ కామ్ గయ్ అంటోంది.

'ప్ర‌భాస్ తెర‌పై చేసిన పాత్ర‌ల‌కంటే భిన్నంగా త‌న నిజ జీవితంలో ఉంటారు. చాలా కూల్ గా..కామ్ గా ప్ర‌శాంతంగా ఉంటారు. సినిమాలో పాత్ర‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం..పాత్ర‌లో ఒదిగిపోయే విధానం న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మంచి స‌హ న‌టుడు. స్వేచ్ఛ‌గా ఉంటారు. ప్రేక్ష‌కులు కోరుకునే దానికంటే ఎక్కువ‌గా అల‌రించ‌గ‌ల న‌టుడాయ‌న‌. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో మాత్రం త‌న‌లో భిన్న‌మైన ప్ర‌భాస్ క‌నిపిస్తాడు.

అప్పుడు అత‌నిలో ఇలాంటి మ‌నిషి కూడా ఉన్నాడా? అనిపిస్తారు. ఆ స్థాయిలో ముఖంలో హ‌వ‌భావాలు క‌నిపిస్తాయి. ఆయ‌న ఫేస్ సీరియ‌స్ లుక్ లోనూ చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. చిల్ అయ్యే స‌మ‌యం లోనూ అంత‌కు మంచి సంతోషంగా ఉంటారు అని అంది. ఇక స‌లార్ లో శ్రుతి హాస‌న్ రోల్ చిన్న‌దిగా ఉండ‌టం అభిమానుల్ని నిరాశ ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో ఎక్కువ స‌న్నివేశాలుంటే బాగుం డని అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో 'స‌లార్ -2' లోనైనా హీరోయిన్ పాత్ర నిడివి పెంచుతారని..ఆమె పాత్ర కీల‌కంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు. మ‌రి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఆ ర‌క‌మైన జాగ్ర‌త్త‌లు ఏవైనా తీసుకుంటారా? అన్న‌ది చూడ‌లి.ఇక ఈ ఏడాది శ్రుతిహాస‌న్ 'వాల్తేరు వీర‌య్య‌'..'వీర‌సింహారెడ్డి' ..'స‌లార్' విజ‌యాల‌తో హ్యట్రిక్ అందుకుని 2023ని సంతోషంగా ముగించి..2024 లోకి రెట్టించిన ఉత్సాహంతో అడుగు పెట్ట‌బోతుంది. దీంతో అమ్మ‌డు న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ప్ర‌త్యేకంగానూ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.