Begin typing your search above and press return to search.

వీడియో: ర‌క్త పిశాచి ఈ క‌ళాకారిణి

సోష‌ల్ మీడియాలో వీడియోని షేర్ చేసిన శ్రుతి ''మాన్‌స్ట‌ర్ మెషీన్ .. ఈ రాత్రికి కలుద్దాం..'' అంటూ వ్యాఖ్య‌ను జోడించింది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 5:18 PM GMT
వీడియో: ర‌క్త పిశాచి ఈ క‌ళాకారిణి
X

శృతిహాస‌న్ సాధించిన విజయాలు త‌న హార్డ్ వ‌ర్క్ .. అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. సౌత్ సినిమా స‌హా బాలీవుడ్ లోను గణనీయమైన కృషికి చాలా గౌరవం అందుకుంది. విస్తృతమైన గుర్తింపును అంకితమైన అభిమానులను సంపాదించుకుంది. శ్రుతి హాసన్ అందం న‌ట‌న‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే శ్రుతి చాలా గ్యాప్ త‌ర్వాత కూడా ఈజీగా కంబ్యాక్ అయింది. చాలా సినిమాల్లో శ్రుతి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు ద‌క్కాయి. శ్రుతి అసాధారణమైన నటనా నైపుణ్యాలతో పాటు, త‌న‌ గానం ప్రతిభ కూడా మంత్రముగ్దులను చేస్తుంది.

శ్రుతి గాయ‌నిగాను మ‌న‌సుల్ని దోచుకుంది. త‌న‌ కళాత్మక పోర్ట్‌ఫోలియో ఇప్ప‌టికే అభిమానుల్లో హాట్ టాపిక్. క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతోంది. ఆకర్షణీయమైన నటన, హృద‌యాల్ని ట‌చ్ చేసే అంద‌మైన‌ చిరునవ్వు త‌న ప్ర‌త్యేక‌త‌. తెలుగు, తమిళం, హిందీ సినిమాలను కలుపుకొని 50 చిత్రాల్లో న‌టించేసింది ఇప్ప‌టికే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగింది. ఇది త‌న‌కు ఉన్న‌ విస్తృత ప్రజాదరణ, అద్భుత విజయానికి నిజమైన నిదర్శనం.

శ్రుతి కెరీర్ ప‌రంగా సౌత్ సినిమాల్లో క‌నిపించినా అటు హిందీ ఆడియెన్ లోను ఫాలోయింగ్ ఉన్న న‌టి. ఇక సోష‌ల్ మీడియాల్లో ఈ భామ‌కు చక్క‌ని గుర్తింపు ఉంది. తాజాగా శ్రుతిహాస‌న్ షేర్ చేసిన ఓ వీడియో అంత‌ర్జాంలో సంచ‌ల‌నంగా మారింది. ఇది డార్క్ థీమ్ తో కూడుకున్న ఒక క‌ళాత్మ‌క ప్ర‌క్రియ‌. శ్రుతి గానాలాప‌న‌లో ఎన‌ర్జీ హుషారెత్తిస్తోంది.

సోష‌ల్ మీడియాలో వీడియోని షేర్ చేసిన శ్రుతి ''మాన్‌స్ట‌ర్ మెషీన్ .. ఈ రాత్రికి కలుద్దాం..'' అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. ఇందులో శ్రుతి ర‌క్తం తాగే రాక్ష‌సికి సింబాలిక్ గా అద్భుత‌మైన అభిన‌యంతో ఆక‌ట్టుకుంటోంది. నిజానికి శ్రుతి మేక‌ప్ విభాగం స‌హా కాస్ట్యూమ్స్ ఇత‌ర సాంకేతిక‌ విభాగాల్లోను బోలెడంత ప్ర‌యోగం చేసింది ఇప్ప‌టికే. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

ఆస‌క్తిక‌రంగా.. శ్రుతి అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ కూడా చేస్తోంది. తాజాగా శ్రుతి షేర్ చేసిన వీడియోపై నెటిజనులు ర‌క‌ర‌కాల కామెంట్లు చేసారు. ఒక అభిమాని త‌న ఆనందం కూడా వ్య‌క్తం చేసాడు. ''ఇది ఎంత అపురూపమైనది. మీరు చాలా కష్టపడి పని చేసారు. ప్ర‌తిదీ ఎలా జరిగిందో మాకు చూపించారు. ఇప్పుడు ప్రపంచం ఈ అందమైన కళాఖండాన్ని ఆస్వాధించవచ్చు. సంబంధం కలిగి ఉంటుంది. ప్రతిబింబిస్తుంది!'' అని రాసాడు. త‌దుప‌రి పాన్ ఇండియా చిత్రం సలార్ పార్ట్-1లో శ్రుతిహాసన్ నటిస్తోంది.