Begin typing your search above and press return to search.

ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తున్న స్టార్ కిడ్

ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   9 March 2024 5:46 AM GMT
ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తున్న స్టార్ కిడ్
X

అవును.. ప‌ట్ట ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తోంది స‌ద‌రు స్టార్ కిడ్. వేస‌విలో కూడా చుక్క‌లు చూడాల్సొస్తోంది. ఇదిగో ఇక్కడ స్టార్స్ తో నిండిన స్పెష‌ల్ డ్రెస్ లో క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని ట్రీటిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈమె ది గ్రేట్ క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌వార‌సురాలు శ్రుతిహాస‌న్. త‌న‌ను ఆరాధించే వారు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోకొల్ల‌లు.


శ్రుతి అంద‌చందాలు.. ఫ్యాష‌న్ ఎంపిక‌లు.. న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌.. డ్యాన్సులు ఇలా ప్ర‌తిదీ ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. అందుకే దశాబ్ధం పైగానే న‌టిగా కెరీర్ బండిని సాఫీగా లాగించేయ‌గ‌లిగింది. గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత శ్రుతి వ‌రుస చిత్రాల్లో న‌టించిన శ్రుతిహాస‌న్.. ఇటీవ‌ల‌ వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్ వంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది. స‌లార్ పార్ట్ 2లో కూడా శ్రుతి న‌టించ‌నుంది. మ‌రోవైపు అటు త‌మిళంలోను వ‌రుస‌గా క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం.

ఇక నేటిత‌రంలో ఎదురేలేని ఫ్యాష‌నిస్టాగా శ్రుతి నిరంత‌ర వైబ్స్ తో అల‌రిస్తోంది. తాజాగా ఎల్లే ఇండియా మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీ కోసం శ్రుతిహాస‌న్ అద్భుత‌మైన ఫోజులిచ్చిన ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది. ఇందులో షోల్డ‌ర్ లెస్ బ్లాక్ గౌన్ పై వైట్ స్టార్స్ తో నిండిన డిజైనర్ లుక్ కుర్ర‌కారును ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ని కుర్ర‌కారు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.