Begin typing your search above and press return to search.

అవ‌మానాన్ని సైతం అంత గొప్ప‌గా ? గ్రేట్ శ్రుతి!

శ్రుతిహాస‌న్ ఏ విష‌యాన్ని అయినా ఓపెన్ మైండ్ తో మాట్లాడుతుంటుంది. దాప‌రికాల‌నేవి అమ్మ‌డి ద‌గ్గ‌ర అస్స‌లుండ‌వు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 6:58 AM GMT
అవ‌మానాన్ని సైతం అంత గొప్ప‌గా ?  గ్రేట్ శ్రుతి!
X

శ్రుతిహాస‌న్ ఏ విష‌యాన్ని అయినా ఓపెన్ మైండ్ తో మాట్లాడుతుంటుంది. దాప‌రికాల‌నేవి అమ్మ‌డి ద‌గ్గ‌ర అస్స‌లుండ‌వు. వ్య‌క్తిగ‌త విషయాల్ని సైతం అంతే ఓ పెన్ గా షేర్ చేసుకుంటుంది. మ‌న‌సులో బ‌రువును మాట‌ల రూపంలో బ‌య‌ట‌కు తెచ్చిన‌ప్పుడే ఆ బ‌రువు త‌గ్గుతుంద‌ని న‌మ్మే న‌టి. అందుకే బోయ్ ప్రెండ్స్ నుంచి ఇంటి వ్య‌వ‌హ‌రాలు అన్నింటిని ఎంతో ఓపెన్ గా చెబుతుంది.

ఈ క్ర‌మంలోనే అమ్మ‌డు త‌న‌కున్న కొన్ని వ్య‌స‌నాల గురించి అంతే ఓపెన్ గా చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో మ‌ద్యానికి బానిసైన అల‌వాటు ఉండేద‌ని... ఇప్పుడు మ‌ద్యం మానేస‌న‌ని..దాదాపు ఎనిమిదేళ్ల‌గా ఆల్కాహాల్ కి దూరంగా ఉంటున్న‌ట్లు చెప్పుకొచ్చింది. తాగ‌డంలో ఎలాంటి ఆనందం లేద‌న్న విష‌యాన్ని చాలా సంవ‌త్స‌రాలు గుర్తించిన‌ట్లు తెలిపింది. పార్టీల‌కు మందుకు దూర‌మైనందుకు ఎలాంటి బాధ లేదు.

ఇప్పుడు ఎలాంటి హ్యాంగోవ‌ర్స్ లేవు. జీవితం చాలా ప్ర‌శాంతంగా సాగిపోతుంది. తాగ‌డం మానేసిన త‌ర్వాత పార్టీలు, ఫ్రెండ్స్‌ను అవైయిడ్ చేయ‌డం చాలా క‌ష్టంగా మారిందంది. అలాగే తాగ‌డం అల‌వాటు ఉన్నా తానేప్పుడూ డ్ర‌గ్స్ జోలికి మాత్రం వెళ్ల‌లేద‌ని శృతిహాస‌న్ చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్య‌ల‌తో శ్రుతి హాస‌న్ ట్రోలింగ్ బారిన ప‌డింది. అమ్మ‌డిని ఇష్టాను సారం ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు.

శ్రుతిహాసన్ ని వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి మాట్లాడ‌టం..అవ‌మానించ‌డం వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో శృతిహాస‌న్ మ‌రోసారి సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చింది. త‌న‌పై వ‌చ్చిన ట్రోలింగ్ గురించి ఎంతో స‌మ‌య‌మ‌నంతో స్పందించింది. `న‌న్ను అవ‌మాన‌రిచే ఏ క‌థ‌నాలు ఫ‌లించ‌వు. దేవుడు ద‌య‌గ‌ల‌వాడు. జీవితం చాలా మంచిది. ప్ర‌తీ రిలీజ్ కి ముందు ఓ నెగిటివ్ వ‌చ్చినా దాన్ని ఎవ‌రూ మార్చ‌లేరు. స‌ర్ బై. మీ ప్ర‌య‌త్నాలు మీరు చేయండి ` అంటూ సింపుల్ గా పోస్ట్ చేసి వెళ్లిపోయింది. శ్రుతి హాస‌న్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం `స‌లార్` ఈ నెల 22న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న‌ సంగ‌తి తెలిసిందే.