Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకి కుమార్తెగా శ్రుతిహాస‌న్!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 171వ చిత్రం లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 April 2024 5:23 AM GMT
స్టార్ హీరోకి కుమార్తెగా శ్రుతిహాస‌న్!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 171వ చిత్రం లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదీ లోకేష్ మార్క్ చిత్ర‌మ‌ని తెలుస్తోంది. ఇందులో సూప‌ర్ స్టార్ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ గా క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ర‌జ‌నీ న్యూ లుక్ తోనే అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. లోకేష్ మార్క్ హీరోని హైలైట్ చేస్తూనే ర‌జ‌నీ ఇమేజ్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఇందులో ర‌జనీకి హీరోయిన్ పాత్ర ఉంటుందా? ఉండ‌దా? అన్న‌ది స‌స్పెన్స్ . లోకేష్ సినిమాలంటే కంటెంట్ ఒక్క‌టే కింగ్ కాబ‌ట్టి హీరోయిన్ ఉన్నా? లేక‌పోయినా? ప‌ర్వాలేదు అన్న ధీమా అంద‌రిలో ఉంది.

అయితే సూప‌ర్ స్టార్ కుమార్తె రోల్ ఒక‌టి సినిమాలో కీల‌కంగా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఆ పాత్రం కోసం స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్ ని ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. సినిమాలో ఈ పాత్రకి అత్యంత ప్రాధాన్యం ఉంద‌ని..అందుకే ఆ పాత్ర‌కు లోకేష్ శ్రుతిహాస‌న్ తీసుకుంటున్న‌ట్లు గ‌ట్టిగానే వినిపిస్తుంది. అదే నిజ‌మైతే శ్రుతిహాస‌న్ న‌ట‌న‌లో కొత్త కోణంగా భావించొచ్చు. ఇప్ప‌టికే హీరోయిన్ గా ఓవెలుగు వెలిగింది. అటుపై ఐటం భామ‌గానూ న‌టించింది.

ఈ రెండింటిలోనూ అమ్మ‌డు గ్రాండ్ స‌క్సెస్ అయింది. తాజాగా కుమార్తె రోల్స్ కి ఎస్ చెప్పిందంటే? అలాంటి ఆఫ‌ర్ల‌కు కొద‌వుండ‌దు. అయితే ఆ పాత్ర‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉండాలి. అప్పుడే శ్రుతి హాస‌న్ క‌న్విన్స్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవ‌లే లోకేష్ తో క‌లిసి శ్రుతి హాస‌న్ ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ వావ్ అనిపించింది. లోకేష్ తో ఇలాంటి వీడియో చేస్తుంద‌న్న సంగ‌తి రిలీజ్ అయ్యే వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌దు.

చిన్న వార్త కూడా లీక్ అవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఆ ర‌కంగా అభిమానుల‌కు ఇద్ద‌రు మంచి స‌ర్ ప్రైజ్ అందించారు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి ర్యాపో క‌నిపిస్తుంది. తాజాగా లోకేష్ యూనివ‌ర్శ్ లోకి శ్రుతిహాస‌న్ ని సిస్ట‌ర్ రోల్ తో ఎంట్రీ ఇప్పించాడు. ఇక‌పై ఆ ఇద్ద‌రు క‌లిసి మ‌రిన్ని అద్బుతాలు చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు.