Begin typing your search above and press return to search.

హిట్ తో షురూ చేసి హిట్ తోనే ముగించింది..!

2023 సంవత్సరం మరో వారం రోజుల్లో ముగియబోతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా ఫ్లాప్స్ తప్ప లేదు

By:  Tupaki Desk   |   26 Dec 2023 5:26 AM GMT
హిట్ తో షురూ చేసి హిట్ తోనే ముగించింది..!
X

2023 సంవత్సరం మరో వారం రోజుల్లో ముగియబోతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా ఫ్లాప్స్ తప్ప లేదు. భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఇక చిన్న సినిమాలు మంచి విజయాలు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి.

చాలా మంది హీరోలు హీరోయిన్స్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డారు. అయితే శృతి హాసన్ మాత్రం ఈ ఏడాది సూపర్‌ హిట్స్ ను దక్కించుకున్నాడు. 2023 ప్రారంభం లో సంక్రాంతి సందర్భంగా ఈ అమ్మడు వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సంక్రాంతికి హిట్‌ తో ఈ ఏడాదిని మొదలు పెట్టిన శృతి హాసన్ ఇదే ఏడాది హాయ్ నాన్న మరియు సలార్ సినిమాలతో ముగించింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సలార్‌ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. దాంతో శృతి హాసన్ లక్కీ హీరోయిన్‌ అంటూ మీడియా వర్గాల వారు మరియు ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఏడాది ఈ అమ్మడు దక్కించుకున్న సూపర్ హిట్స్ నేపథ్యం లో 2024 లో కచ్చితంగా మరిన్ని ఆఫర్లు ఈ అమ్మడికి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హిందీ మరియు ఇతర భాషల్లో కూడా శృతి హాసన్ సినిమాలు చేస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్ లను కూడా ఈ అమ్మడు చేస్తూ కెరీర్‌ లో చాలా బిజీగా ఉంది.

ఈ పాత్ర.. ఆ పాత్ర అని కాకుండా అన్ని భాషల సినిమాలు, సిరీస్ లు, అన్ని తరహా పాత్రలను చేస్తూ ఉన్న శృతి హాసన్‌ కు 2023 సంవత్సరం కచ్చితంగా కెరీర్‌ లో ఎప్పటికి గుర్తుంచుకోదగ్గ సంవత్సరం అనడంలో సందేహం లేదు. మరి ఈ అమ్మడికి 2024 ఏడాది ఎలా ఉంటుందో చూడాలి.