Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : టాటూ చూపిస్తూ కవ్విస్తున్న స్టార్‌ కిడ్‌

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్‌ అతి తక్కువ సమయంలో తన తండ్రి నీడ నుంచి బయట పడింది

By:  Tupaki Desk   |   21 Nov 2023 6:12 AM GMT
పిక్ టాక్ : టాటూ చూపిస్తూ కవ్విస్తున్న స్టార్‌ కిడ్‌
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్‌ అతి తక్కువ సమయంలో తన తండ్రి నీడ నుంచి బయట పడింది. కెరీర్‌ ఆరంభం నుంచి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తూనే వచ్చింది. సాధారణంగా సౌత్‌ స్టార్‌ కిడ్స్ ఒక జోనర్‌ లో ఉండి పోతారు. కానీ శృతి హాసన్ మాత్రం అలా లేకుండా పూర్తి స్వేచ్చగా సినిమాలు చేస్తూ వచ్చింది.


మొదటి సినిమాలోనే బికినీ ధరించడం ద్వారా సంచలనం సృష్టించిన శృతి హాసన్ హిందీ, తమిళ, తెలుగు భాష ల సినిమాల్లో మరియు సిరీస్ ల్లో నటించడం ద్వారా పాన్ ఇండియా కమ్‌ ఆల్ రౌండర్‌ నటి అన్నట్లుగా పేరు దక్కించుకుంది. ఇక ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోల గురించి ఎంతగా చెప్పుకున్నా తక్కువే.


తాజాగా మరోసారి హాట్‌ ఫోటోలతో సోషల్ మీడియా ద్వారా సంచలనం సృష్టించింది. తన బ్యాక్‌ పై ఉన్న ట్యాటూ ను చూపిస్తూ ఇచ్చిన ఫోజ్ అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోయిన్స్‌ సాధారణంగా ఇలాంటి హాట్ ప్లేస్ లో ఉన్న టాటూలను చూపించేందుకు ఆసక్తి చూపించరు. కానీ ఈ అమ్మడు మాత్రం తన టాటూను చూపిస్తూ కవ్విస్తోంది.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే తాజాగా ప్రభాస్ తో కలిసి ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ సినిమాలో నటించింది. అంతే కాకుండా హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వచ్చిన ఏ ఒక్క ఆఫర్‌ ని కాదు అనకుండా వెబ్‌ సిరీస్‌ లను కూడా ఈమె చేస్తోంది. ఐటం సాంగ్స్ లో కూడా చేసేందుకు ఈ స్టార్‌ కిడ్ రెడీగా ఉందట.