Begin typing your search above and press return to search.

శృతి హాసన్‌ ఫ్యాన్స్‌కి బిగ్‌ బ్యాడ్‌ న్యూస్‌

యూనివర్సల్ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   9 July 2025 2:00 AM IST
శృతి హాసన్‌ ఫ్యాన్స్‌కి బిగ్‌ బ్యాడ్‌ న్యూస్‌
X

యూనివర్సల్ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. సాధారణంగా స్టార్‌ కిడ్స్ అంటే సినిమాల ఎంపిక విషయంలో, ఏం చేసినా కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. కానీ శృతి హాసన్ అలా ఉండదని, తానో పెద్ద స్టార్‌ కిడ్‌ అయినప్పటికీ చాలా సింపుల్‌గా, బోల్డ్‌గా ఉంటుందని అంటారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న శృతి హాసన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అందమైన ఫోటోలను మొదలుకుని ఎన్నో రకాల బోల్డ్‌ కామెంట్స్‌, స్టేట్‌మెంట్స్ షేర్ చేస్తూ ఉండేది.

శృతి హాసన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా పాతిక మిలియన్‌ల మంది ఫాలో అవుతూ ఉంటారు. రెగ్యులర్‌గా శృతిహాసన్‌ షేర్ చేసే పోస్ట్ ల కారణంగా ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా ఉంది. కేవలం ఇన్‌స్టాలో మాత్రమే కాకుండా ఈమెకు ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ పైనా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. వారందరికీ ఇప్పుడు పెద్ద బ్యాడ్‌ న్యూస్‌. అందేంటంటే తాను కొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. సోషల్‌ మీడియాకి దూరంగా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉండవచ్చని భావిస్తున్నట్లు శృతి హాసన్ తన పోస్ట్‌లో పేర్కొంది. రీ ఎంట్రీ విషయమై ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం వల్ల సైలెన్స్‌ను ఎంజాయ్‌ చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సెలబ్రిటీలు సోషల్‌ మీడియాను వదిలి ఉండలేరు అని వచ్చే విమర్శను తిప్పి కొట్టేందుకు శృతి హాసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శృతి హాసన్‌ కొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియాలో కనిపించే అవకాశం లేదు. దాంతో ఆమె జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియడం కష్టం. గతంలో రెండు సార్లు ప్రేమలో విఫలం అయిన శృతి హాసన్‌ మూడో సారి ప్రేమలో పడటం వల్లే ఈ నిర్ణయానికి వచ్చిందంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయమై శృతి నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే వచ్చే నెలలో ఈమె నటించిన రజనీకాంత్‌ 'కూలీ' సినిమా విడుదల కాబోతుంది. ఆ సమయంలో కూలీ సినిమా ప్రమోషన్స్‌కు శృతి హాసన్ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏమైనా ఈమె తన సోషల్ మీడియా వైరాగ్యం గురించి స్పందిస్తుందా అనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్‌ సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం అంటే కెరీర్‌ పై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో శృతి హాసన్‌ సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆమె కెరీర్‌పై శ్రద్ద తగ్గించిందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. శృతి ఫ్యాన్స్ మాత్రం ఆమె రీ ఎంట్రీ వెంటనే ఉండాలని కోరుకుంటున్నారు.