అమ్మా నాన్న విడిపోతే నేనేమీ బాధ పడలేదు: శ్రుతిహాసన్
మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజం అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. పైన ఒకటి లోన ఒకటి ఉంటుంది కొందరికి.
By: Tupaki Desk | 11 Jun 2025 8:15 AM ISTమనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజం అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. పైన ఒకటి లోన ఒకటి ఉంటుంది కొందరికి. కానీ ఆ బాపతు కాదు శ్రుతిహాసన్. తన మనసులో ఏం ఉంటే అదే మాట్లాడుతుంది. సూటిగా విషయాన్ని చెప్పేస్తుంది. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు తాను ఎంత మాత్రం బాధపడలేదని శ్రుతిహాసన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అమ్మా నాన్న విడిపోతున్నందుకు కలతకు గురి కాలేదని, వారు కలిసి ఉండి బాధపడే కంటే, విడిపోయి సంతోషంగా ఉంటేనే మంచిదని భావించినట్టు తెలిపింది.
కమల్ హాసన్- సారిక జంట విడిపోయినప్పుడు శ్రుతిహాసన్ దానికి చాలా కలత చెందినా కానీ, వారు కలిసి ఉండాలని భావించలేదు. తన తండ్రి నుంచి విడిపోయిన తర్వాత తన తల్లి సారిక స్వతంత్య్రంగా తనను తాను తిరిగి ఎలా పునర్మించుకుందో కూడా గుర్తు చేసింది. సారిక ఎవరి మద్దతు కోసం ఎదురుచూడలేదు.. వేచి ఉండలేదు. ఆ బలం శ్రుతిపై ఒక ముద్ర వేసింది. ఆర్థికంగా మాత్రమే కాకుండా ఎమోషన్స్ పరంగా కూడా స్వతంత్రంగా ఉండటం ఎంత ముఖ్యమో శ్రుతి చాలా ముందుగానే నేర్చుకుంది. సారిక స్వతహాగా తన జీవితాన్ని ఎలా నిర్మించుకుందో తనకు తెలుసు. అమ్మా నాన్న విడిపోయినా ఆ ఇద్దరితో శ్రుతి చక్కగా కలిసిపోతుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే శ్రుతి తదుపరి సలార్ 2లో నటించనుంది. ఇటీవల తన తండ్రి దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ సినిమా కోసం పాడింది. శ్రుతి వ్యక్తిగత జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నా కానీ, అన్నిటినీ తట్టుకుని నిలబడింది అంటే, మానసికంగా ధృఢంగా మారడమే దీనికి కారణం.