పన్నెండేళ్ల తరువాత శృతిహాసన్!
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ చాలా ఏళ్ల విరామం తరువాత చేస్తున్న తెలుగు సినిమా ఇది.
By: Ravindar Gorantla | 29 April 2026 9:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `సలార్` తరువాత ఆ స్థాయి క్రేజీ ప్రాజెక్ట్‌ని దక్కించుకోలేక పోయింది శృతిహాసన్. సూపర్ స్టార్ రజనీకాంత్ `కూలీ`లో ప్రీతిగా కీలక పాత్రలో నటించినా శృతికి దక్కాల్సిన క్రేజ్ దక్కలేదు. కెరీర్ పరంగా కొంత డౌన్ ఫాల్ అవుతూ వస్తున్న శృతిహాసన్ తమిళంలో ట్రైన్, తెలుగులో `ఆకాశంలో సగం` వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని రూపొందిస్తున్న `ఆకాశంలో సగం` మూవీలో శృతి మోయిన్ లీడ్ హీరోయిన్ కాదు.
సెకండ్ హీరోయిన్. మెయిన్ లీడ్‌గా సాత్విక వీరవల్లి నటిస్తోంది. `సలార్ 2` స్టార్ట్ అయి రిలీజ్ అయితే కానీ అమ్మడి జాతకం మారదు అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శృతిహాసన్ తాజాగా బంపర్ ఆఫర్‌ని సొంతం చేసుకుని ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి చేసింది. అదే `పెద్ది`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `పెద్ది`. రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ చాలా ఏళ్ల విరామం తరువాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రై రై రారా.. లిరికల్ వీడియోలు నెట్టింట సందడి చేస్తూ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబడుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. చరణ్ క్రికెట్ బ్యాటింగ్ స్టైల్, భుక్ స్టెప్ ఇప్పటికే ట్రెండ్ కావడం, ఆ తరువాత కుస్తీ యోధుడిగా చరణ్ కొత్త లుక్‌ని రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా చరణ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
ఇదిలా ఉంటే ఇందులోని ఓ ప్రత్యేక గీతంని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దీని కారణంగానే `పెద్ది` రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఫైనల్‌గా ఆ సాంగ్ కోసం టీమ్ క్రేజీ హీరోయిన్ శృతిహాసన్‌ని ఫైనల్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ని హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం చరణ్‌తో కలిసి `ఎవడు` మూవీలో నటించిన శృతి ఆ తరువాత మరో సినిమాలో నటించలేదు. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత `పెద్ది` కోసం కలిసి తెరపై కనిపించబోతున్నారు.
అయితే `ఎవడు`లో చరణ్‌కు జోడీగా నటించిన శృతి `పెద్ది` కోసం మాత్రం స్పెషల్ సాంగ్‌లో కనిపించి కనువిందు చేయబోతోంది. అయితే ఈ పాట కోసం శృతి భారీగానే పారితోషికాన్ని డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు సాధారణంగా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య తీసుకునే శృతి `పెద్ది` స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా రూ.3 కోట్లు తీసుకుంటోందని ఇన్ సైడ్ టాక్.
