నా ఇష్టం... మరో ఫేస్ సర్జరీ చేయించుకుంటా!
కమల్ నట వారసురాలు శృతి హాసన్ రెండో కేటగిరీకి చెందిన హీరోయిన్. ఈమె ఏ విషయంలోనూ గోప్యత పాటించదు.
By: Tupaki Desk | 21 Jun 2025 11:09 AM ISTసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మాత్రమే కాకుండా హీరోలు కూడా అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. కొందరు బరువు తగ్గడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. అన్ని భాషల ఇండస్ట్రీలోనూ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అయితే చాలా మంది తాము చేయించుకున్న సర్జరీల గురించి బయట మాట్లాడేందుకు ఆసక్తి చూపించరు. అసలు తాము ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు, కొన్ని ఎక్సర్‌సైజ్‌లు, కొన్ని రకాల క్రీమ్‌లు వాడిన కారణంగా అందంగా మారాము అంటూ ఉంటారు. కొందరు మాత్రం ఓపెన్‌గా ఔను మేము ఆపరేషన్ చేయించుకున్నాం, అందంగా కనిపించడం కోసం మేము మా ఫేస్‌కి సర్జరీలు చేయించుకుంటే మీకు ఏంటి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు.
కమల్ నట వారసురాలు శృతి హాసన్ రెండో కేటగిరీకి చెందిన హీరోయిన్. ఈమె ఏ విషయంలోనూ గోప్యత పాటించదు. ప్రేమ విషయం మొదలుకుని శృంగార జీవితం వరకు అన్ని విషయాల పట్ల ఆమె చాలా ఓపెనింగ్ మాట్లాడేస్తూ ఉంటుంది. ఆమె మాట్లాడే మాటలు కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి, అది కాకుండా ఒక పాన్ ఇండియా స్టార్ కూతురు అయ్యి ఉండి ఇలా మాట్లాడుతారా.. ఇండియాలో అమ్మాయిలు మరీ ఇంత ఓపెన్‌గా ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా శృతి హాసన్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆమె స్కిన్ షో ఫోటో షూట్ మొదలుకుని ప్రతి విషయం గురించి వార్తల్లో ఉంటుంది.
తాజాగా శృతి హాసన్ తన సర్జరీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు చిన్నప్పటి నుంచి తన ముక్కు అంటే ఇష్టం ఉండేది కాదట. అందుకే ఆ ముక్కుకు సర్జరీ చేయించుకున్నాను. నా శరీరం నా ఇష్టం, నా ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయించుకుంటాను అన్నట్లుగా శృతి హాసన్ బోల్డ్‌గా మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలు కాస్త ఎబెట్టుగా ఉన్నా నిజమే కదా అనిపించక మానవు. ముఖం మరింత అందంగా కనిపించడం కోసం ఫిల్లర్స్ కూడా వాడాను అంటూ ఓపెన్‌గానే చెప్పేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతలు పోగొట్టుకునేందుకు గాను ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకుంటానేమో అంటూ ముందే తేల్చి చెప్పింది. ఇలా ప్లాస్టిక్ సర్జరీల గురించి, అందానికి సంబంధించిన సర్జరీ గురించి హీరోయిన్స్ మాట్లాడటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
ఇక శృతి హాసన్ హీరోయిన్‌గా బిజీ బిజీగానే ఉంటుంది. ఆ భాష ఈ భాష... ఆ పాత్ర, ఈ పాత్ర అని చూడకుండా వచ్చిన ప్రతి ఒక్క పాత్రను చేసేందుకు ముందుకు వస్తుంది. అంతే కాకుండా ఐటెం సాంగ్స్‌లో నటించేందుకు రెడీ అంటుంది. సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ ఈమె నటిస్తుంది. ప్రభాస్‌తో ఈమె సలార్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది మాత్రమే కాకుండా తెలుగులో ఈమె మరో రెండు సినిమాలకు కమిట్ అయిందని, హిందీలో పలు సినిమాలు, సిరీస్‌లు ఈమె నుంచి రాబోతున్నాయని సమాచారం అందుతోంది. త్వరలోనే కూలీ సినిమాతో ఈమె రజనీకాంత్‌తో కలిసి రాబోతుంది. ఇలా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ అందంగా కనిపింస్తున్న శృతి హాసన్ బోల్డ్ కామెంట్స్ చర్చనీయాంశం కావడం ఇదే కొత్త కాదు. మరీ ఇంత బోల్డ్‌గా మాట్లాడటం అవసరమా అని మాత్రం కొందరు కామెంట్స్ చేస్తున్నారు.