Begin typing your search above and press return to search.

ఎన్నో నెంబ‌ర్ ల‌వ‌ర్ అని అడిగేవారు!

By:  Tupaki Desk   |   23 July 2025 8:45 AM IST
ఎన్నో నెంబ‌ర్ ల‌వ‌ర్ అని అడిగేవారు!
X

శ్రుతిహాస‌న్ ల‌వ్ స్టోరీల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే అమ్మ‌డి ఖాతాలో రెండు ల‌వ్ స్టోరీలు న్నాయి. తొలిసారి మైఖేల్ కోర్స‌లేతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అత‌డితో పెళ్లికి కూడా సిద్ద‌మైంది. కానీ అంత‌లోనే ఆ బంధం వీగిపోయింది. దీంతో మాన‌సికంగానూ శ్రుతి కొంత డిస్ట‌బెన్స్ కి గురైంది. అటుపై కొంత గ్యాప్ తీసుకుని శంత‌ను హ‌జారిక‌తో ల‌వ్ లో ప‌డింది. ఇత‌డితోనూ కొన్నాళ్ల పాటు మంచి బంధాన్నే క‌లిగి ఉంది. కానీ ఈ బంధం కూడా ఎంతో కాలం నిల‌వ‌లేదు.

కానీ మైఖెల్ తో ఏర్ప‌ర చుకున్నంత స్ట్రాంగ్ బాండింగ్ శంత‌ను తో లేదు. తొలిసారి ఎదురైన అనుభ‌వంతో ఈసారి మాన‌సిక కృంగు బాటుకు అంత‌గా గురికాలేదు. బ్రేక‌ప్ నుంచి తొంద‌ర‌గానే బ‌య‌ట‌కొచ్చి వృత్తి ప‌రంగా బిజీ అయింది. ఈ క్ర‌మంలో నెటి జనుల నుంచి ఎన్నో విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కుంది. కానీ వాటిపై ఏనాడు స్పందించ‌లేదు. తాజాగా వాటిపై తొలిసారి రియాక్ట్ అయింది. `నా ప్రేమ క‌థ‌లు ఇత‌రుల‌కు సిల్లీగా అనిపించొచ్చు. కానీ నాకు అలా కాదు. మీరు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేను.

నాతో ఇప్పుడు ఎవ‌రైనా క్లోజ్ గా ఉంటే ఎన్న‌వ బోయ్ ప్రెండ్ అని హేళ‌న చేస్తున్నారు. కానీ నా బాధ ఎవ‌రికీ అర్దం కాలేదు. నేను కోరుకున్న ప్రేమ ద‌క్క‌క్క‌పోవ‌డంతోనే విఫ‌ల‌మ‌వుతున్నా. ఇది న‌న్ను చాలా బాధి స్తుంది. నేను మ‌నిషినే ..నాకు ఎమోష‌న్స్ ఉంటాయి. అలాగ‌ని నా మాజీల‌ను ఎప్ప‌టికీ విమ ర్శించ‌ను. నా వ‌ర‌కూ నేను ఎంత నిజాయితీగా ఉన్నాను? అన్న‌దే చూస్తాను` అని తెలిపింది. ఈ బ్రేక‌ప్ విష‌యంలో శ్రుతి మాజీలు కూడా ఎక్క‌డా స్పందించ‌ని సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే మునుప‌టి కంటే హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గాయి. ప్ర‌స్తుతం కూలీ, జ‌న‌నాయ‌గ‌న్, ట్రైన్ చిత్రాల్లో న‌టిస్తోంది. తెలుగులో మాత్రం స‌లార్ తర్వాత మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌లేదు. స‌లార్ 2 లో కొన‌సాగుతుంది. కానీ సినిమా ఇప్పుడే రిలీజ్ అవ్వ‌దు. మ‌రో రెండేళ్లు అయినా స‌మ‌యం ప‌డుతుంది. మ‌రి ఈలోపు మ‌రో తెలుగు సినిమా ఛాన్స్ అందుకుంటుందా? అన్న‌ది చూడాలి.