శృతిహాసనే కావాలంటున్న ప్రశాంత్ నీల్
యాక్షన్ ఘట్టాలతో షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ మరో సారి ఎన్టీఆర్ కోసం తన మార్క్ డార్క్ థీమ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
By: Tupaki Desk | 24 April 2025 8:14 PM ISTకేజీఎష్ సిరీస్, `సలార్`తో సంచలనం సృష్టించిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. `డ్రాగన్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ మూవీ సెట్‌లోకి ఎన్టీఆర్ రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ ఘట్టాలతో షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ మరో సారి ఎన్టీఆర్ కోసం తన మార్క్ డార్క్ థీమ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ మూవీ కోసం ఆయన ఏకంగా 18 కిలోలు బరువు తగ్గడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సినిమా కోసం ఎన్టీఆర్ మరీ ఇంత లీన్‌గా మారడంపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే `డ్రాగన్` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ అడుగుపెట్టడంతో ఆయనకు సంబంధించిన కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారట. భారీ యాక్షన్ సన్నివేశాలని రూపొందిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ షెడ్యూల్‌ని భారీగా ప్లాన్ చేశారట. అంతే కాకుండా ఈ షెడ్యూల్ సుధీర్గంగా సాగుతుందని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతిహాసన్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రుక్మీణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా కీలకమైన ఓ ఐటమ్ నంబర్‌లో శృతి కనిపించనుందని ఇన్ సైడ్ టాక్.
అంతే కాకుండా సినిమాలో ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ సాంగ్స్‌ని పెడుతున్నారట. అందులో భాగంగానే ఓ సన్నివేశంలో ఐటమ్ సాంగ్ ని క్రియేట్ చేశారట. దాని కోసం శృతిహాసన్‌ని దించేస్తున్నారని తెలిసింది. సినిమాలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ క్యారెక్టర్ రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకు భిన్నంగా సాగుతుందని, అయితే సినిమాలో గ్లామర్ అవసరం కాబట్టి దాన్ని పూడ్చడానికి శృతిహాసన్‌తో స్పెషల్ ఐటమ్ సాంగ్‌ని ప్లాన్ చేశారట. షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాతే శృతి స్పెషల్ సాంగ్‌ని షూట్ చేస్తారట. ప్రశాంత్ నీల్ రూపొందించిన `సలార్`లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. పార్ట్ 2లోనూ తనే హీరోయిన్.
