శృతి హాసన్‌కి ఒకేసారి సంతోషం, బాధ..!
శృతి హాసన్ స్టార్ కిడ్ అయినప్పటికీ తన సొంత కాళ్లపై ఎదిగిన వ్యక్తి. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కమల్ కూతురు అనే ట్యాగ్ ఉపయోగపడింది.
By: Tupaki Desk | 6 Jun 2025 11:28 AM ISTశృతి హాసన్ స్టార్ కిడ్ అయినప్పటికీ తన సొంత కాళ్లపై ఎదిగిన వ్యక్తి. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కమల్ కూతురు అనే ట్యాగ్ ఉపయోగపడింది. కానీ ఆ తర్వాత ఆమె హిట్ సాధించడానికి, టాప్ స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంకు తండ్రి కమల్ ను ఎప్పుడూ వినియోగించుకోలేదు. శృతి హాసన్ ఒక స్టార్ కిడ్ అన్నట్లుగా ఎప్పుడూ వ్యవహరించదు అని ఆమెతో వర్క్ చేసిన వారు, ఆమె సన్నిహితులు అంటారు. ఆమె సోషల్ మీడియాలో చాలా బోల్డ్‌గా కామెంట్స్ చేస్తూ ఉంటుంది, ఆమె ఎప్పుడూ ఏదో విషయం గురించి పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె లవ్ బ్రేకప్ విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా మరో హార్ట్ బ్రేక్ విషయాన్ని శృతి హాసన్ తన ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. గత కొన్ని నెలల నుంచి శృతి హాసన్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి పిల్ల కనిపించడం లేదు. ఆ పిల్ల విషయమై శృతి గతంలోనూ ఒక ఇన్‌స్టా స్టోరీని పెట్టింది. తాను ఎంతో ప్రేమించే పిల్లి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ శృతి హాసన్ పెట్టిన పోస్ట్ ఆ సమయంలో వైరల్ అయింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత శృతి తన పిల్లి పిల్ల కనిపించిందని ఆనందంగా చెప్పుకొచ్చింది. చాలా నెలల తర్వాత కనిపించిన తన పిల్లి పిల్ల కోరా ను చూడటం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. కోరా చాలా బక్క చిక్కి కనిపించిందని శృతి పేర్కొంది.
చాలా రోజులుగా ఇంటికి దూరంగా ఉన్న కోరాను చూడటం సంతోషాన్ని కలిగించింది. కానీ ఆ సమయంలో కోరాకు గాయాలు కనిపించడంతో పాటు, చాలా నీరసంగా, బక్కచిక్కి కనిపించిందని శృతి హాసన్ ఆవేదన వ్యక్తం చేసింది. కోరా తనను గుర్తు పట్టలేదని, అంతే కాకుండా తిరిగి ఇంటికి రావడానికి కోరా ఇష్టం లేదు అనిపించింది. కోరా తన ప్రపంచంలో తాను ఉండాలని భావిస్తుంది. కోరా కనిపించినందుకు సంతోషంగా ఉన్నా, తను ఇంటికి వచ్చేందుకు ఇష్టం చూపించక పోవడంతో బాధ కలిగిందని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. పిల్లికి సంరక్షకురాలుగా ఉండటం అనేది చాలా కఠినమైన జాబ్ అని, తన కోరా బతికి ఉండటం సంతోషాన్ని కలిగించిందని హార్ట్ బ్రేక్ ఈమోజీని శృతి షేర్ చేసింది.
శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే సలార్ 2 తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కంటే ముందు రజనీకాంత్ కూలీ సినిమాతో శృతి హాసన్ రాబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాలో హీరోయిన్ గా నటించడం ద్వారా శృతి హాసన్ కోలీవుడ్‌లో మరోసారి స్టార్‌డం దక్కించుకోనుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. మరో వైపు బాలీవుడ్, తెలుగు సినిమాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. క్రమం తప్పకుండా ఈ అమ్మడి సినిమాలు ఏడాదికి ఒకటి రెండు, అంతకు మించి వస్తూనే ఉన్నాయి, ఈ ఏడాది, వచ్చే ఏడాదిలోనూ ఈ అమ్మడి సినిమాలు ఉంటాయి.
