Begin typing your search above and press return to search.

న‌టిపై త‌ల్లిదండ్రుల విడాకుల ప్ర‌భావం

సెల‌బ్రిటీ లైఫ్ ఎంతో గొప్ప‌గా ఉంటుంద‌ని ఊహించుకుంటే పొర‌పాటే. జీవితంలో అత్యంత వేగంగా ఒక‌దాని వెంట ఒక‌టిగా వ‌రుస‌ ప‌రిణామాల్ని ఎదుర్కొనేది సెల‌బ్రిటీలే.

By:  Tupaki Desk   |   26 April 2025 8:35 PM IST
న‌టిపై త‌ల్లిదండ్రుల విడాకుల ప్ర‌భావం
X

సెల‌బ్రిటీ లైఫ్ ఎంతో గొప్ప‌గా ఉంటుంద‌ని ఊహించుకుంటే పొర‌పాటే. జీవితంలో అత్యంత వేగంగా ఒక‌దాని వెంట ఒక‌టిగా వ‌రుస‌ ప‌రిణామాల్ని ఎదుర్కొనేది సెల‌బ్రిటీలే. శ్రుతిహాస‌న్ జీవితం అందుకు ఒక ఉదాహ‌ర‌ణ‌. త‌న చిన్న వ‌య‌సులోనే అమ్మా నాన్న విడిపోవ‌డం త‌న‌కు ఎంతో పెద్ద లోటు. అయితే శ్రుతి త‌న తండ్రికి క‌నెక్ట‌యింది. అమ్మా నాన్నల‌తో అంతా బావున్న‌ప్పుడు ఆనందంగా ఉన్న‌ రోజులు ఉన్నాయి. ల‌గ్జ‌రీ లైఫ్ త‌న‌కు ఉంది. కానీ అమ్మా నాన్న విడిపోయిన‌ప్పుడు ప‌రిస్థితులు మారాయి. త‌ను ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది.

క‌మ‌ల్ హాస‌న్ - సారిక దంప‌తులు విడిపోయాక‌ ముంబైలో త‌న సోద‌రి అక్ష‌ర‌తో క‌లిసి శ్రుతి స్థానిక రైళ్ల‌లో ప్ర‌యాణించాన‌ని కూడా తెలిపింది. త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉన్న‌ప్పుడు బెంజిలో సౌఖ్యం తెలుసు. క‌లిసి లేన‌ప్పుడు లోక‌ల్ రైళ్ల‌లో టికెట్ కొనుక్కుని వెళ్ల‌డం తెలుసు. అందుకే తాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం నేర్చుకుంది. అలాంటి విభిన్న‌మైన జీవితం త‌న‌కు ఉంది గ‌నుక చాలా తొంద‌ర‌గా పాఠాల్ని నేర్చుకున్నాన‌ని తెలిపింది.

అయితే త‌ల్లిదండ్రులు విడిపోయినా త‌న తండ్రి క‌మ‌ల్ హాస‌న్ త‌న చ‌దువుల‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించారు. విదేశాల‌ల‌లో సంగీత విద్య‌ను అభ్య‌సించింది. సినీరంగంలో స్టార్ హీరోయిన్ గా ఎదగ‌డంలో త‌న తండ్రి ప‌రిచ‌యాలు స‌హ‌క‌రించాయి. అంత‌ర్జాతీయ పాప్ ప్ర‌పంచంలో రాణించేందుకు శ్రుతి ప్ర‌య‌త్నించింది. కానీ వ్య‌క్తిగ‌త జీవితంలో రెండు సార్లు ల‌వ్ ఫెయిలైన శ్రుతి కొంత‌కాలం పాటు డిప్రెష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

సూపర్ స్టార్ కమల్ హాసన్ చాలా సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత నటి సారిక‌ను 80ల‌లో వివాహం చేసుకున్నారు. కమల్ హాసన్ తొలుత డ్యాన్స‌ర్ వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. ఈ జంట‌ 1988లో విడాకులు తీసుకున్నారు. కమల్ హాసన్ - సారిక జంట వివాహం అనంత‌రం 1986 లో వారి మొదటి బిడ్డ శ్రుతి హాసన్ కు స్వాగతం పలికారు. రెండవ సంతానం అక్షర 1991 లో జన్మించింది. కుమార్తెలిద్ద‌రూ న‌టీమ‌ణులు అయ్యారు. సారిక‌- కమల్ హాసన్ 2004 లో విడాకులు తీసుకున్నారు.