శ్రుతి హాసన్ 2025లోనూ చప్పగానే!
శ్రుతిహాసన్ వెండి తెరపై కనిపించి ఏడాదిన్నర పూర్తయింది. `సలార్ సీజ్ ఫైర్` తర్వాత ఒక్క చిత్రం కూడా రిలీజ్ అవ్వలేదు.
By: Tupaki Desk | 31 May 2025 5:00 PM ISTశ్రుతిహాసన్ వెండి తెరపై కనిపించి ఏడాదిన్నర పూర్తయింది. `సలార్ సీజ్ ఫైర్` తర్వాత ఒక్క చిత్రం కూడా రిలీజ్ అవ్వలేదు. `సలార్` కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలకమైందే? అయినా అమ్మడు కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. ఆరంభం..ముగింపులో మాత్రమే హైలైట్ అయింది. మిగతా కథ అంతా ప్రభాస్- పృధ్వీరాజ్ సుకుమారన్...ఇతర పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దీంతో శ్రుతి హాసన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కడ? అన్న అంశం అమ్మడికి ప్రతికూలంగా మారింది.
గత ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ లో లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా అమ్మడి కెరీర్ చప్పగానే సాగేలా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న `కూలీ` చిత్రంలో శ్రుతి హాసన్ నటిస్తుంది. కానీ అందు లో శ్రుతి పాత్ర ఏ మేర ఉంటుంది? అన్నది సందేహమే. అలాగే మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ట్రైన్` లోనూ నటిస్తుంది. విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ పోషిస్తున్న చిత్రమిది. శ్రుతి హాసన్ హీరోయిన్ కాదు. ఓ పాత్రధారి మాత్రమే.
ఈ సినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల్లో కూడా శ్రుతి హాసన్ పేరుకే తప్ప ఆమె పాత్ర బలంగా ఉంటుందా? అన్నది సందేహమే. అదే జరిగితే శ్రుతి కెరీర్ లో ఈ రెండేళ్లు పెద్దగా సాధించింది ఏం లేనట్లే. విజయ్ హీరోగా నటిస్తోన్న `జననాయగన్` లో నటిస్తుంది. ఇందులో హీరోయిన్ పాత్ర పూజాహెగ్డే పోషిస్తుండగా ఓ కీలక రోల్ శ్రుతి హాసన్ పోషిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.
`సలార్ 2` చేతిలో ఉన్నా? అదెప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడు పూర్తవుతుంది? అన్నది తెలియదు. ఇంకా కొత్త కమిట్ మెంట్లు ఏవైనా ఉన్నాయా? అంటే కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. ఇతర భాషల్లో కూడా శ్రుతి హాసన్ ఎలాంటి సినిమాలకు అగ్రిమెంట్ చేసుకోలేదు. దీంతో శ్రుతి కెరీర్ పరంగా వీక్ గానే కనిపిస్తుంది.
