అమీర్ ఖాన్ ని అలా పిలిచిన శ్రుతి హాసన్!
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను కూడా సహచర నటుల పిల్లలు కూడా ఏ నాడు అంకుల్ అని సంబోధించరు.
By: Tupaki Desk | 27 July 2025 12:27 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్..మెగాస్టార్ చిరంజీవి..నటసింహ బాలకృష్ణ లాంటి నటుల్ని అంకుల్ అని సహచర నటుల కుమారులు, కుమార్తెలు పిలుస్తుంటారు. ఆ కుటుంబాలతో ఉన్న స్నేహం కారణంగా అలాంటి బాండింగ్ వాళ్ల మధ్య ఉంటుంది. కానీ కింగ్ నాగార్జున...విక్టరీ వెంకటేష్ లను మాత్రం ఎవరూ అంకుల్ అని సంబోధించే వారు చాలా తక్కువ మందే ఉంటారు. వాళ్ల హీరోయిక్ లుక్...గ్రేస్..ఛరిష్మా వంటి అంత తొందరగా అంకుల్ అనిపించలేవు.
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను కూడా సహచర నటుల పిల్లలు కూడా ఏ నాడు అంకుల్ అని సంబోధించరు. సార్ అనే సంబోధన ఎక్కు వగా వినిపిస్తుంది. అందులోనే ఒకే రంగంలో కొనసాగితే అంకుల్ పిలుపు కూడా పెద్దగా వినిపించదు. మరి విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె ...అమీర్ ఖాన్ ని ఏమని పిలుస్తుందో? తెలిస్తే ఆయన అభిమానలు ఫీల్ అవ్వడం ఖాయం. అవును అమీర్ ఖాన్ ను శ్రుతి హాసన్ అంకుల్ అని ఎంతో అభిమానంతో పిలుస్తుందిట.
ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది. అమీర్ ఖాన్ కుటుంబంతో తనకు ఎంతో మంచి రిలేషన్ షిప్ ఉందని....డాడ్ తో అమీర్ ఎంతో క్లోజ్ గా ఉంటారుట. శ్రుతి హాసన్ జీవితంలో ఓ ముఖ్యమైన దశలో అమీర్ అండ్ కో శ్రుతి హాసన్ కి ఎంతో అండగా నిలబడిందని గుర్తు చేసుకుంది. అమీర్ ఖాన్ వయసు 60 ఏళ్లు కాగా...శ్రుతి హాసన్ కు 40 ఏళ్లు. ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇండస్ట్రీలో వయసు వ్యత్యాసం లేకుండా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
50 ఏళ్ల హీరోతో 20 ఏళ్ల హీరోయిన్ నటించడం..25 ఏళ్ల భామలు కనిపించడం వంటింది సర్వసాధరణం. ఇలాంటి కాంబినేషన్లపై నెగివిటీ వ్యక్తమైన వాటిని సెలబ్రిటీలు పట్టించుకోకుండా ముందుకెళ్తుంటారు. ప్రస్తుతం రణవీర్ సింగ్ హీరోగా దురంధర్ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా సారా అర్జున్ నటిస్తోంది. సారా వయసు 20 ఏళ్లు కాగా, రణవీర్ వయసు 40. వ్యత్యాసం 20 ఏళ్లు ఉన్నా? సోషల్ మీడియాలో విమర్శలొచ్చినా వాటిని టీమ్ లైట్ తీసుకుంది.
