Begin typing your search above and press return to search.

పవన్‌ రాజకీయాల గురించి శృతి హాసన్‌..!

శృతి హాసన్‌ గత సంవత్సరం ఒక్క సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాలేదు. చివరగా శృతి హాసన్‌ సలార్‌ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   12 July 2025 5:00 AM IST
పవన్‌ రాజకీయాల గురించి శృతి హాసన్‌..!
X

శృతి హాసన్‌ గత సంవత్సరం ఒక్క సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాలేదు. చివరగా శృతి హాసన్‌ సలార్‌ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు రజనీకాంత్‌తో నటించిన కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. గత ఏడాది బ్రేకప్‌ కారణంగా శృతి హాసన్‌ కాస్త ఇబ్బందులు ఎదుర్కొని, సినిమాలకు దూరంగా ఉండటం వల్లే రిలీజ్‌లు ఏమీ లేవని టాక్‌. ఆ విషయమై ఆమె ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇటీవల ఒక పాడ్‌ కాస్ట్‌లో శృతి హాసన్‌ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. పెళ్లి గురించి మాట్లాడుతూ కొత్త రిలేషన్‌లోకి వెళ్లాలంటే భయంగా ఉందని, పెళ్లి తర్వాత విడిపోతే సింగిల్‌ పేరెంట్‌గా ఉండాల్సి వస్తుందని శృతి హాసన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ అమ్మడికి మొదటి విజయాన్ని పవన్‌ కళ్యాణ్‌ అందించిన విషయం తెల్సిందే. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన 'గబ్బర్‌ సింగ్‌' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో పవన్‌కు జోడీగా శృతి హాసన్ నటించింది. అంతకు ముందు నటించిన పలు సినిమాలు ఫ్లాప్ కావడంతో చాలా మంది శృతి హాసన్‌ను ఐరెన్‌ లెగ్‌ అంటూ సంభోధించారు. ఒకానొక సమయంలో ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఎప్పుడైతే గబ్బర్‌ సింగ్‌ విజయం సాధించిందో అప్పటి నుంచి శృతి హాసన్‌ కెరీర్‌ మలుపు తిరిగింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలు సొంతం చేసుకుంది.

కేవలం సినిమాల్లో హీరోయిన్‌గా నటించకుండా, వెబ్‌ సిరీస్‌ల్లో ముఖ్య పాత్రల్లోనూ నటించడం ద్వారా శృతి హాసన్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. తాజాగా ఇచ్చిన పాడ్‌ కాస్ట్‌లో శృతి హాసన్‌ గబ్బర్‌ సింగ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను గబ్బర్‌ సింగ్‌ పాత్ర కోసం అడిగిన సమయంలో కొన్ని కారణాలు చెప్పి తిరస్కరించాను. కానీ దర్శకుడు హరీష్ శంకర్‌ మాత్రం వదిలి పెట్టలేదు. ఆ పాత్రలో మిమ్ములను మాత్రమే చూశాను అని తప్పకుండా చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. దాంతో కొన్ని వారాల తర్వాత ఆ సినిమా కథ విన్నాను, కథ నచ్చడంతో చేసేందుకు సిద్ధం అయ్యాను. ఆ సినిమా చేయడం వల్లే ఈ రోజు నా కెరీర్‌ ఇలా ఉందని నేను నమ్ముతాను అంది.

ఇక పవన్‌ కళ్యాణ్‌ గారు చాలా సింపుల్‌ పర్సన్ అని, స్టార్‌డం ఎప్పుడూ చూపించరని అంది. గ్రామాలు, వ్యవసాయం గురించి ఎక్కువ ఆసక్తి కనబర్చే పవన్‌ కళ్యాణ్‌ వంటి వారు రాజకీయాల్లో ఉండటం చాలా అవసరం. ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పుకొచ్చాడు. కెరీర్‌ మొత్తం సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో రెండు సార్లు శృతి హాసన్‌ ప్రేమలో విఫలం అయింది. దాంతో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. ఇక పై ప్రేమ, పెళ్లికి నో అంటూ గట్టిగా తనకు తాను చెప్పుకున్న శృతి హాసన్‌ కెరీర్‌ పై మరింత ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాదిలో కూలీతో పాటు మరో సినిమాతోనూ శృతి హాసన్ రాబోతుంది. వచ్చే ఏడాదిలో సలార్‌ 2 తో వస్తుందేమో చూడాలి.