ఆ ఫ్లాప్ ఇప్పటికీ బాధిస్తూ ఉంటుంది
కొన్ని సినిమాలు ఎంత బావున్నా అవి కమర్షియల్ గా వర్కవుట్ అవ్వవు. మరికొన్ని సినిమాలు కంటెంట్ బాలేకపోయినా హిట్టవుతుంటాయి.
By: Tupaki Desk | 26 July 2025 2:00 PM ISTకొన్ని సినిమాలు ఎంత బావున్నా అవి కమర్షియల్ గా వర్కవుట్ అవ్వవు. మరికొన్ని సినిమాలు కంటెంట్ బాలేకపోయినా హిట్టవుతుంటాయి. ఇంకొన్ని అయితే రిలీజైన టైమ్ ను బట్టి కూడా ఉంటుంది. కొందరు డైరెక్టర్లు కొన్నేళ్ల ముందే ఈ కాలానికి సెట్టయ్యే సినిమాలు చేస్తుంటారు. కానీ ఆ రోజుల్లో ఆడియన్స్ కు ఉన్న థాట్ ప్రాసెస్ కు ఆ సినిమాలు పెద్దగా ఎక్కవు. ఫలితంగా సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి.
అలా చాలానే సినిమాలొచ్చాయి. అలాంటి కేటగిరీలో కొన్ని సినిమాలను చెప్తుంటారు. అందులో ధనుష్, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన త్రీ సినిమా కూడా ఒకటి. ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజైన టైమ్ లో ఫ్లాపుగా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ త్రీ సినిమా ఇప్పుడు రిలీజైతే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు.
రీసెంట్ గా కూలీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ త్రీ సినిమా గురించి మాట్లాడారు. త్రీ సినిమా తనకెంతో ఇష్టమైన సినిమా అని, ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ రాకపోవడం ఇప్పటికీ బాధగానే అనిపిస్తుందని, త్రీ మూవీ చేయడానికి తాను చాలా కష్టపడ్డానని, కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదని శృతి అన్నారు.
ఒకవేళ త్రీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని, ఆ సినిమాలోని వై దిస్ కొలవెరి డీ సాంగ్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో ఆ సినిమాలోని కంటెంట్ అంతకంటే గొప్పగా ఉండేదని, త్రీ మూవీ ఇప్పుడు రిలీజైతే ఆ సాంగ్ కంటే హిట్టవుతుందని శృతి అభిప్రాయపడ్డారు. శృతి చెప్పినట్టు త్రీ సినిమాలోని కంటెంట్ బావుంటుంది. కానీ ఆ సినిమా ఆల్రెడీ రిలీజై ఫ్లాపైంది కాబట్టి ఇప్పుడేమనుకున్నా ప్రయోజనముండదు.
