Begin typing your search above and press return to search.

బాబోయ్ ఏంటి ఈ ఫోజు అమ్మడు?

పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ అందాల ముద్దుగుమ్మ స్కిన్ షో మాత్రం ఆపడం లేదు

By:  Tupaki Desk   |   1 Aug 2023 11:19 AM GMT
బాబోయ్ ఏంటి ఈ ఫోజు అమ్మడు?
X

2001వ సంవత్సరంలో ఇష్టం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రియ శరన్. ఆ తర్వాత వెంటనే నాగార్జున సంతోషం సినిమాలో నటించింది. మొదటి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ వెంటనే బాలకృష్ణకు జోడిగా చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.


ఆ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సంవత్సరం నువ్వే నువ్వే సినిమా, మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమా ల్లోనూ నటించిన ఈ ముద్దు గుమ్మ కి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాదాపు పది సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఇప్పటికి కూడా అవకాశాలు దక్కించుకుంటూ సినిమాల్లో నటిస్తూనే ఉంది.

పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ అందాల ముద్దుగుమ్మ స్కిన్ షో మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఫాలోవర్స్ కి షాక్ ఇస్తోంది. తాజాగా మరో సారి అందాలు ఎక్స్పోజ్ చేసింది. ఈ ఫోటోలో శ్రియ అందాల ఆరబోతతో పాటు ఆమె ఫిట్నెస్ ని కూడా చూడవచ్చు. కాలు 90 డిగ్రీలు లేపి మరి ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

సాధారణంగా మూడు పదుల వయసు దాటిన హీరోయిన్స్ కొందరు ఈ స్థాయిలో ఫిట్గా ఉండరు. కానీ శ్రియ సరన్ మాత్రం నాలుగు పదుల వయసుకు చేరుతున్నా కూడా అంతే ఫిట్గా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఫిట్ ఉన్న ముద్దుగుమ్మ శ్రియ శరన్ కి వరుసగా ఆఫర్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్టార్ హీరోలు కూడా శ్రియ తో నటించాలని ఆశపడుతున్నారు.