Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చీర కట్టులో అందాల విందు

ఇప్పటికే పెళ్లి చేసుకుని, తల్లి అయిన తర్వాత కూడా శ్రియా సరన్‌ అందం విషయంలో కొత్త హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది

By:  Tupaki Desk   |   28 Feb 2024 7:55 AM GMT
పిక్ టాక్ : చీర కట్టులో అందాల విందు
X

ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియా సరన్‌. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి అయినా కూడా ఇంకా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందంటే కారణం ఆమె అందం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికి పాతికేళ్ల పడుచు అమ్మాయి అనిపించేంత అందంగా శ్రియా ఉంటుంది.

ఇప్పటికే పెళ్లి చేసుకుని, తల్లి అయిన తర్వాత కూడా శ్రియా సరన్‌ అందం విషయంలో కొత్త హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉండే శ్రియా తాజాగా మరోసారి చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసి వావ్ అనిపించింది.

కన్నుల విందు చేసే విధంగా ఎద సౌందర్యం తో ఎప్పటిలాగే శ్రియా సరన్‌ ఆకట్టుకుంది. అందమైన శ్రియా సరన్‌ అంతకు మించిన నటన ప్రతిభతో మెప్పించింది. తాజా చీర కట్టు ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో హిందీలో వరుసగా సినిమాల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ శ్రియా సరన్‌ సౌత్ లో కూడా తనకు అంది వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ఉంది. శ్రియా అందం నేపథ్యంలో మరో పదేళ్ల పాటు అందం విషయంలో ఎలాంటి డోకా లేకుండా సోషల్‌ మీడియా ద్వారా సందడి చేయడం ఖాయంగా అనిపిస్తోంది.