Begin typing your search above and press return to search.

ఓల్డ్ మెమోరీలోకి జారుకున్న బ్యూటీ!

ఇండ‌స్ట్రీలో శ్రియ శ‌ర‌న్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు ద‌శాబ్ధాల ప్ర‌యాణం. ఎన్నో భాషల్లో న‌టించిన అనుభం.

By:  Tupaki Desk   |   16 April 2024 10:40 AM GMT
ఓల్డ్ మెమోరీలోకి జారుకున్న బ్యూటీ!
X

ఇండ‌స్ట్రీలో శ్రియ శ‌ర‌న్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు ద‌శాబ్ధాల ప్ర‌యాణం. ఎన్నో భాషల్లో న‌టించిన అనుభం. ఎక్క‌డైనా స‌త్తా చాటే ప్ర‌తిభ. నాలుగు ప‌దుల వ‌య‌సులోనే న‌వ నాయిక‌లా వెలిగిపోవ‌డం ఆమెకే చెల్లింది. ఇంత‌కు మించి ఆమె లో స్పెషాల్టీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. అందం ముందు న‌వ నాయిక‌లు సైతం ఆమె ముందు? ఎంతా అనిపించ‌డం...అలా మెయింటెన్ చేయ‌డం ఆమెకే చెల్లింది. ఓబిడ్డ‌కు త‌ల్లైనా! ఇప్ప‌టికే అదే బ్యూటీ తో నెట్టింట సంచ‌ల‌నం అవ్వ‌డం శ్రీయ స్పెషాల్టీ. తాజాగా అమ్మ‌డు మ‌ళ్లీ ఆనాటి జ్ఞాప‌కాల్లోకి జారుకుంది.


ఓ పాత ఫోటో షూట్ ని మ‌ళ్లీ రీ షేర్ చేసి మెమోరీస్ అంటూ రాసుకొచ్చింది. అందులో అమ్మ‌డు సిల్వ‌ర్ క‌ల‌ర్ ప్లోరల్ దుస్తుల్లో త‌ళుకులీని వైనానికి ఫిదా అవ్వాల్సిందే. ప‌ర్పెక్ట్ డిజైన్ కి ప‌క్కాగా సెట్ అయింది. మెడ‌లో డ్రెస్ ని మ్యాచ్ చేస్తూ డిజైన‌ర్ నెక్లెస్ తో అంతే అందంగా క‌నిపిస్తుంది. అమ్మ‌డి అలంక‌ర‌ణ ప్ర‌తీది శ్రియ‌ని ఎంతో అందంగా మ‌లిచాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గామారింది. పాత ఫోటో అయినా..శ్రీయ ఇప్ప‌టికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తోంది.

ఫోటో పాతేదే అయిన కామెంట్లు మాత్రం కొత్త‌గానే ప‌డుతున్నాయి. ఇంత‌కు ముందు చూసిన ఫోటో అని అభిమానులు లైట్ తీసుకోలేదు. త‌మ‌స్టైల్లో అభిమానం కురిపిస్తూనే ఉన్నారు. ఇక శ్రియ కెరీర్ సంగ‌తి చూస్తే అమ్మ‌డికిప్పుడు సినిమా అవ‌కాశాలు బాగా త‌గ్గాయి. ఏ భాష‌లోనూ అవ‌కాశాలు రావ‌డం లేదు. దీంతో టీవీ సిరిస్ ల్లోకి ఎంట‌ర్ అయింది. ప్ర‌స్తుతం `షో టైమ్` అనే సిరీస్ చేస్తుంది. చివ‌రిగా శ్రియ `మ్యూజిక్ స్కూల్` అనే తెలుగు చిత్రంలో న‌టించింది.

అలాగే క‌న్న‌డ‌..త‌మిళం..మ‌ల‌యాళం చిత్రాల్లో కూడా న‌టించింది. కానీ తెలుగు..త‌మిళ్ ల్లో స‌క్సెస్ అయినంత‌గా ఇత‌ర భాష‌ల్లో స‌క్సెస్ అవ్వ‌లేదు. ఇక నెట్టింట అభిమానుల‌కు నిత్యం ఫోటో షూట్ల‌తో ట‌చ్ లో నే ఉంటుంది. వెకేష‌న్లకు వెళ్లినా ఆ అనుభూతుల్ని పంచుకుంటుంది.