Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నేరేడు ప‌ళ్లు నీ నీలాల క‌ళ్లు

నేరేడు ప‌ళ్లు.. అంటూ ఒక ప్ర‌ముఖ‌ సినీక‌వి శ్రీ‌య అంద‌మైన క‌ళ్ల‌ను చూసి పాట రాసాడు

By:  Tupaki Desk   |   18 March 2024 4:21 AM GMT
ఫోటో స్టోరి: నేరేడు ప‌ళ్లు నీ నీలాల క‌ళ్లు
X

నేరేడు ప‌ళ్లు.. అంటూ ఒక ప్ర‌ముఖ‌ సినీక‌వి శ్రీ‌య అంద‌మైన క‌ళ్ల‌ను చూసి పాట రాసాడు. ఆ పాట ఆ ఆల్బ‌మ్ కే హైలైట్ గా నిలిచింది. వెంక‌టేష్ 'సుభాష్ చంద్ర‌బోస్' చిత్రంలో నేరేడు క‌ళ్ల‌తో శ్రీ‌య ఎంత‌గా క‌వ్వించిందో అభిమానులు మ‌రువ‌లేనిది.

నేరేడు ప‌ళ్లు నీ నీలాల క‌ళ్లు.. నీ రాక కోసం కంటున్నాయి క‌ల‌లు! అంటూ అంద‌మైన మెలోడీని అందించిన ఆ ర‌చ‌యిత జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌ సుద్ధాల అశోక్ తేజ‌. అదంతా గ‌తం అనుకుంటే వ‌ర్త‌మానంలో శ్రీ‌య అవే క‌ళ్లు కుర్ర‌కారును వెంటాడుతూనే ఉన్నాయి.

క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడిన శ్రీ‌య ఒక చ‌క్క‌ని ఆడ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. కూతురికి రాధ అనే అంద‌మైన పేరును కూడా పెట్టుకుంది. ఇక‌పోతే త‌న భ‌ర్త‌తో క‌లిసి ప‌బ్లిక్ వేదిక‌ల‌పై ఎలాంటి భేష‌జం లేకుండా స‌ర‌స‌మాడే శ్రీ‌య త‌న‌లోని బోల్డ్ యాంగిల్ ని ఎప్ప‌టికీ విడిచిపెట్ట‌డం లేదు. ఇప్పుడు అంద‌మైన చీర‌లో అంతే అందంగా నేరుడు క‌ళ్ల‌ను తిప్పుతూ ఫోటోల కోసం ఫోజులిచ్చింది.

పింక్ ఛ‌మ్కీల బ్లౌజు, దానికి కాంబినేష‌న్ గా లైట్ పింక్ శారీని ధ‌రించిన శ్రీ‌య క్రీగంటి చూపుల‌తో గుచ్చేస్తోంది. డిజైన‌ర్ లుక్ లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఆ నేరేడు క‌ళ్ల‌తో సూటిగా చూస్తూ చంపేస్తోంది. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోగ్రాఫ్ వెబ్ లో వైర‌ల్ గా దూసుకుపోతోంది. శ్రీ‌య ఇటీవ‌ల వెబ్ సిరీస్ ల‌పైనా దృష్టి సారించింద‌ని తెలుస్తోంది. క‌బ్జా- మ్యూజిక్ స్కూల్ త‌ర్వాత సినిమా ఛాన్సులు త‌గ్గాయి. అటుపై షోటైమ్ అనే ఓటీటీ సిరీస్ లో న‌టించింది. ఆ త‌ర్వాత వెబ్ సిరీస్ లపై పూర్తిగా దృష్టి సారిస్తోంద‌ని స‌మాచారం.